Anil Ravipudi Ipl Statement: నేను డిఫెండ్ చేసుకోవడం కాదు, మీరు అఫెండ్ అయ్యారని..

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత పెద్దగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సెలబ్రిటీలు ఏం మాట్లాడినా కొంతమేరకు చెల్లెది. కానీ ఇప్పటిలో అలా కాదు. ఒక మాట మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా దాన్ని ఎంతలా ట్రోల్ చేస్తారో ఇప్పుడున్న సెలబ్రిటీలకు తెలియంది కాదు. రీసెంట్ టైమ్స్ లో ఎంతో మంది సెలబ్రిటీలు ట్రోల్స్ కి గురైన సంగతి కూడా తెలిసిందే. అయితే అన్ని స్టేట్మెంట్లతోనే అందరూ ఏకీభవిస్తారు అనే గ్యారెంటీ కూడా లేదు.

రీసెంట్ గా సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలామంది దర్శకులు హాజరయ్యారు. అయితే క్రికెట్ చూడకపోవడం వలన కొంపలేం మునిగిపోవు. ముందు సినిమాలకు రండి. ఫస్ట్ షో చూడండి, సెకండ్ షో చూడండి క్రికెట్ స్కోరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు అంటూ స్టేట్మెంట్ను పాస్ చేశారు అనిల్ రావిపూడి. అయితే దీనిపై చాలామంది వ్యతిరేకంగా స్పందించారు. కొంతమంది అయితే క్రికెట్ మానేసి సినిమా చూడాల్సిన అంత అవసరం ఏముంది.? అంత గొప్ప సినిమాలు ఏమున్నాయి అంటూ కొందరు ప్రశ్నించారు.

ఏదేమైనా క్రికెట్ అనేది ఫ్రీగా ఇంట్లో కూర్చుని చూడొచ్చు. బట్ సినిమా అనేది థియేటర్ కెళ్ళి టిక్కెట్ కొనుక్కోవాలి. థియేటర్లో పాప్కాన్ రేట్లు కూడా హై రేట్లు ఉన్నాయి అంటూ చాలామంది అనిల్ ని ట్రోల్ చేశారు. ఇకపోతే అనిల్ ఎంత కష్టపడి నేడు సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటాస్ సినిమా దగ్గర తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి కెరియర్ లో ఒక డిజాస్టర్ కూడా లేదు. అలా అని కాంట్రవర్సి లు కూడా పెద్దగా లేవు.

- Advertisement -

రీసెంట్ గా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో కొంతమేరకు ట్రోల్ అయ్యాడు అనిల్. ఇకపోతే అనిల్ రీసెంట్ జరిగిన డైరెక్టర్స్ మీట్ లో ఈ స్టేట్మెంట్ను మళ్ళీ ప్రస్తావిస్తూ ముందు ఐపీఎల్ చూడండి. ఒకవేళ టైముంటే మా సినిమాలను కూడా ఎంకరేజ్ చేయండి అంటూ మరో కొత్త స్టేట్మెంట్ను పాస్ చేశాడు. ఇంతకుముందు నేను చేసిన స్టేట్మెంట్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అనిల్ ఈ మాట చెప్పడం వెనక అసలైన ఉద్దేశం ఏంటో కూడా చెప్పుకొచ్చాడు. ఏదేమైనా అనిల్ కూడా తను కూడా క్రికెట్ కి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పాడు. అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్టును వెంకటేష్ తో చేయనున్నారు. అనిల్ రావిపూడి డైరెక్టర్స్ మీటింగ్ గురించి చెప్తున్నప్పుడు మధ్యలో మల్లిడి వసిష్ఠ వచ్చి ఆరోజు మ్యాచ్ ఉంది అని అనటం, దాంతో లాస్ట్ టైం తన ఇచ్చిన స్టేట్మెంట్ను మార్చడం జరిగింది. నేను డిఫెండ్ చేసుకోవడం కాదు, మీరు అఫెండ్ అయ్యారు అని నా స్టేట్మెంట్ కరక్ట్ చేశా అన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు