Akshay Kumar : సీక్వెల్స్ ని నమ్ముకున్న ఖిలాడీ.. ఏకంగా నాలుగు లైన్లో పెట్టాడు?

Akshay Kumar : బాలీవుడ్ స్టార్ కిలాడీ అక్షయ్ కుమార్ రీసెంట్ గా “బడే మియా చోటే మియా” తో వచ్చి డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. భారీ మల్టీస్టారర్ గా వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం వంద కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే గత మూడేళ్ళుగా వరుస పరాజయాలు అందుకుంటున్న కిలాడీ అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఒక సినిమాకు విమ‌ర్శ లొచ్చినా, ప్ర‌శంస‌లొచ్చినా ఆయ‌న‌కు సంబంధం లేదు. త‌న‌ప‌ని కేవ‌లం న‌టుడిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే అంటూ ముందుకుసాగిపోతున్నారు. విమ‌ర్శ‌లు ట్రోలింగ్ ల‌కు ఇప్ప‌టికే తాను బాగా అల‌వాటు ప‌డిపోయాన‌ని ఓపెన్ గానే చెప్పేసారు. ఇప్ప‌టికే అక్ష‌య్ ఖాతాలో డ‌జ‌ను ప్లాపులు సినిమాలున్నాయి. ఇక రాబోయే 2024 సినిమాల షెడ్యూల్ అంతా ఫుల్ అయింది. వ‌చ్చే ఏడాది షెడ్యూల్ కూడా ఇప్ప‌టి నుంచి నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్షయ్ కుమార్ సీక్వెల్స్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు సిద్ధమయ్యాడు.

నాలుగు సీక్వెల్స్ లైన్లో పెట్టిన అక్షయ్?

అయితే రెగ్యులర్ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో తనకు అచొచ్చిన కామెడీ జోనర్ లో హిట్ కొట్టినందుకు రెడీ అవుతున్నాడు అక్షయ్ కుమార్. అది కూడా సీక్వెల్ ఫ్రాంచైజీ లను దింపుతున్నట్టు సమాచారం. తాజాగా మ‌రో రెండు సినిమాలు క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా సంచ‌ల‌నం సృష్టించిన హౌస్ ఫుల్ ప్రాంచైజీ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. ‘హౌస్ పుల్’ సిరీస్ నుంచి వ‌స్తోన్న ఐద‌వ చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో యూకే లో మొదులు కానుంది. సాజిద్ న‌డియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం స్టోరీ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. అక్ష‌య్ కుమార్ తో పాటు రితేష్ దేశ్ ముఖ్ తొలుత షూటింగ్ లో పాల్గొంటారు. అలాగే కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన ‘జాలీ ఎల్ఎల్ బీ’ నుంచి మూడ‌వ భాగం కూడా షురూ అయింది. సుభాష్ క‌పూర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు అక్ష‌య్ కుమార్ ఇన్ స్టా వేదిక‌గా రివీల్ చేసారు. త్వ‌ర‌లో ఢిల్లీలో కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. అందులో అక్ష‌య్ కుమార్ కూడా పాల్గొంటారు.

వరుసగా క్రేజ్ ప్రాజెక్టులు..

ఇక ఈ సినిమాలే కాకుండా సూర్యవంశ్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే అది వచ్చే ఏడాది మొదలుకానుంది. ఇవే కాకుండా OMG2 కూడా సక్సెస్ అయినందువల్ల వచ్చే ఏడాది దీనికి సీక్వెల్ గా మూడో భాగం తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి మ‌రో భాగం వ‌స్తున్న‌ట్లు రిలీజ్ అయిన టైం లోనే సినిమాలో హింట్ ఇచ్చారు. ఇలా అక్ష‌య్ కుమార్(Akshay Kumar) ఆల్రెడీ సెట్స్ లో ఉన్న రెగ్యులర్ సినిమాల‌తో పాటు మ‌రో నాలుగు సినిమాల షూటింగ్ లకి రెడీ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఇవే కాక సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా రీమేక్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు