Sukumar: యూఎస్ ఆడియన్స్ కి థాంక్స్

Sukumar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి మొదటి సినిమాతోని మంచి హిట్ సినిమాను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్నాడు. సుకుమార్ సినిమా అంటే చాలు ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్లిపోవచ్చు అని అనుకునే ఆడియన్స్ కూడా ఉన్నారు. అంత అద్భుతంగా ఉంటాయి సుకుమార్ తీసే సినిమాలు. సుకుమార్ సినిమాల్లో హీరోలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని చెప్పొచ్చు. సుక్కు సినిమాలో హీరోలంతా చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తుంటారు అచ్చం సుకుమార్ లానే.

సుకుమార్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా సుకుమార్ ఒక దర్శకుడుగా ఏ రోజు ఫెయిల్ కాలేదు. ఏదో ఒక కొత్త అంశాన్ని తన సినిమాల్లో చూపించడంలో సుకుమార్ ఎప్పుడూ ముందుంటారు అని చెప్పొచ్చు. కేవలం యూత్ ని ఆకట్టుకునే కొత్త అంశాలు మాత్రమే కాకుండా చాలామంది కమర్షియల్ ప్రేక్షకులును కూడా అలరించే మాస్ ఎలిమెంట్స్ కూడా సుకుమార్ సినిమాల్లో ఉంటాయి. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరిలో కల్లా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ మంది దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తున్నాడు సుకుమార్. అలానే నుంచి వచ్చిన మరోదర్శకుడు అర్జున్. రీసెంట్ గా ప్రసన్న వదనం అనే సినిమా తెరకెక్కించాడు అర్జున్.

సుహాస్ హీరోగా చేసిన సినిమా ప్రసన్న వదనం. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ లో కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది. అయితే ఈ విషయంపై సుకుమార్ ఆడియోన్స్ కి థాంక్స్ తెలిపారు. నా సినిమాలుకు మంచి సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మా అర్జున్ సినిమా ప్రసన్నవదనం కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కలెక్షన్స్ కూడా బాగున్నాయని తెలుస్తుంది. చాలా చాలా థాంక్స్ అండి అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్.

- Advertisement -

ఇక ప్రసన్న వదనం సినిమా చేసిన సుహాస్ విషయానికి వస్తే కలర్ ఫోటో సినిమాతో మొదటగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి సినిమాలతో అద్భుతమైన ఘన విజయాలను అందుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు థియేటర్ వద్ద కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ను సాధించాయి. ఇప్పుడు ప్రసన్న వదనం సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది. ఏదేమైనా మంచి కథలను ఎన్నుకొని అతి తక్కువ మంది హీరోల్లో ఇప్పుడున్న జనరేషన్లో సుహాస్ కూడా ఒకడు అని చెప్పొచ్చు. అలానే సుహాస్ కూడా తనకు వచ్చిన ప్రతి కథను చేయకుండా తనకు నచ్చిన కథను మాత్రమే చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు