Heeramandi : ఆ హీరోయిన్ ని రోజంతా ఆకలితో ఉంచిన డైరెక్టర్..

Heeramandi : టాలెంటెడ్ హీరోయిన్ అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా హీరోయిన్ అదితి రావు హైదరికి మంచి గుర్తింపు ఉంది. పైగా తెలంగాణ కి చెందిన తెలుగమ్మాయి కావడంతో మరింత పాపులర్ అయింది. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పి తన అభిరుచి ఏంటో తెలిపింది. ఇక నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్లలో అదితి రావు ఒకరు. ఇక కొన్నాళ్ల పాటు సినిమాలు తగ్గించినా సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉంటుంది. ఇక కోలీవుడ్ హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉన్న అదితి రావు, రీసెంట్ గా వీరిద్దరు దాదాపు మూడేళ్లుగా సహ జీవనం సాగిస్తున్నారనే వార్తలు రాగా, ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నారని ఫొటోలతో సహా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, అదితి రావు ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవుతూ బిజీ అవుతుంది. అయితే తాజాగా అదితి రావు హీరామండి అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూ లో పంచుకుంది.

డైరెక్టర్ రోజంతా ఆకలితో ఉంచారు!

అదితి రావు హైదరి తాజాగా నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ సంజయ్ లీలా భన్సాలి వెబ్‌ సిరీస్ ‘హీరామండీ’ లో కీలకమైన వేశ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ ఇలాంటి పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించరు. కానీ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో కనుక ఏ ఒక్కరు ఆ పాత్రను కాదనలేరు. భన్సాలీ సినిమాలో సెట్‌ ప్రాపర్టీకి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అందుకే భన్సాలి తీసిన ఈ విభిన్న వెబ్‌ సిరీస్‌ లో స్టార్‌ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, అదితి రావు హైదరి, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్, ఫర్దీన్ ఖాన్‌ లతో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖులు నటించడం జరిగింది. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అదితి రావు హైదరి మాట్లాడింది. అదితి మాట్లాడుతూ… హీరామండీ సిరీస్ కోసం తాను ఒక రోజంతా కూడా ఆకలితో ఉండాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా ఉండమని దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ చెప్పారు. ఒక ఫైర్‌ ఫుల్‌ సీన్ చేయాల్సి ఉంటుంది కనుక దానికోసం ఆకలితో ఉండమని బన్సాలీ చెప్పారు అని అంది.

సీన్ రక్తి కట్టించాము..

ఇక భన్సాలీ చెప్పడం వల్ల రోజంతా ఆకలితో వెయిట్‌ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో ఆ సీన్ ని షూట్‌ చేశారు. ఇక బన్సాలీ సర్ చెప్పినట్లు చేయడం వల్ల ఆ సన్నివేశంలో చాలా ఈజీగా నటించగలిగాను. సాధారణంగా అయితే ఆ సీన్‌ ను చేయడానికి ఖచ్చితంగా సమయం ఎక్కువ పట్టేది. కానీ ఏమీ తినకుండా చేయడం వల్ల ఆ షాట్ త్వరగా పూర్తి అయ్యింది. స్క్రీన్‌ పై ఆ సీన్‌ ను చూస్తున్న సమయంలో ఖచ్చితంగా ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారు అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా హీరమండి(Heeramandi) లో అదితి రావు పాత్ర మాత్రమే కాదు, అందరి పాత్రలు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిని బట్టి హైలెట్ అవుతున్నాయి. అయితే హీరమండి ని ముందు సినిమాగా తీద్దామనుకున్న సంజయ్, ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని వెబ్ సిరీస్ లా చేసారు. ఏది ఏమైనా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు