SanjayLeela Bhansali : ఎన్ని రోజులు ఇలా వేశ్యల మీద సినిమాలు?

SanjayLeela Bhansali : బాలీవుడ్ లో కళాత్మక చిత్రాలు నిర్మించే డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ని కూడా పలకరిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో రాజమౌళి ఎలాగో బాలీవుడ్ వాళ్ళకి సంజయ్ లీలా భన్సాలీ అలా అని చాలా మంది అంటుంటారు. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచిన ఈ దిగ్గజ దర్శకుడు పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆయన తెరకెక్కించిన రామ్-లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ లాంటి తదితర చిత్రాలన్నీ కళాఖండాలు అనిపించుకోవడమే కాదు, బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. రెండేళ్ల కింద ‘గంగూభాయ్ కతీయవాడి’ సినిమాతో హిట్టు కొట్టిన సంజయ్ లీలా, ఈ ఇయర్ హీరామండి అనే భారీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ వెబ్ సిరీస్ సోషల్ మీడియా లో డీసెంట్ టాక్ తెచ్చుకోగా, నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

వేశ్యల పై సినిమాలు ఎన్నాళ్ళు?

అయితే భన్సాలీ రీసెంట్ గా తీసిన సినిమాలు గమనిస్తే.. ఆయన తీసే సినిమాలపై వేశ్యల ప్రభావం బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా కథలన్నీ వేశ్యలు, వేశ్య గృహాల చుట్టే తిరుగుతాయి. వాటిల్లో ప్రధాన పాత్రదారులు ఎక్కువగా వేశ్యలుగా కనిపిస్తారు. ‘దేవదాస్’ మూవీ నుంచి ‘హీరామండి’ వెబ్ సిరీస్ వరకూ గమనిస్తే, మనకు ఈ విషయం అర్థమవుతుంది. అప్పట్లో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్. మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘దేవదాస్’ సినిమా తీశారు. ఇక ఇందులో చంద్రముఖి అనే వేశ్య పాత్రలో మాధురీ నటించింది. అలాగే రణబీర్ కపూర్, సోనమ్ కపూర్ లు హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ స్టోరీ ‘సావరియా’ సినిమాలో గులాబ్జీ అనే ప్రాస్టిట్యూట్ పాత్రను బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ పోషించింది. ఇక ఈ మధ్యన స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ తీసిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా కథంతా వేశ్యలు, వేశ్య గృహాలు చుట్టూనే తిరుగుతుంది. ఇందులో అలియా భట్ వేశ్యగా నటించింది. అనుకోని పరిస్థితుల్లో వేశ్యగా జీవితాన్ని ప్రారంభించిన గంగుబాయి.. బొంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేసిందనేది ఈ సినిమాలో చూపించారు. దీంట్లో వేశ్యల జీవితాలను భన్సాలీ అద్భుతంగా తెర మీద ఆవిష్కరించారు.

హీరామండి లోనూ!

ఇక లేటెస్ట్ గా ‘హీరామండి పేరుతో భన్సాలీ తీసిన వెబ్ సిరీస్ కూడా వేశ్యా ప్రధానంగా తెరకెక్కిన సినిమానే. ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌ సిరీస్‌. భారీ తారాగణంతో 8 ఎపిసోడ్ లుగా రూపొందించిన ఈ పీరియాడిక్‌ డ్రామా సిరీస్ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ తదితరులు నటించారు. దీంట్లో మహిళా ప్రధాన పాత్రధారులందరూ వేశ్యలుగానే కనిపిస్తారు. వేశ్యవాటిక నేపథ్యంలో సాగే కథే అయినప్పటికీ, ఒక్కచోట కూడా అసభ్యకరమైన సన్నివేశం కానీ, అసభ్య పదజాలం కానీ లేకుండా రూపొందించారు భన్సాలీ. ఇలా సంజయ్‌ లీలా భన్సాలీ అనేక వేశ్యల కథలను తెర మీద ఆవిష్కరించారు. ఈ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాయి.

- Advertisement -

ఎన్ని రోజులు ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు?

అయితే సంజయ్ లీలా భన్సాలీ ఇలా వరుసగా వేశ్యలపైనే సినిమాలు తీస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎన్ని రోజులు ఇదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీస్తారు. కొత్తగా పద్మావత్ లాంటి చిత్రాలు తీయొచ్చుకదా అని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజానికి సంజయ్ లీలా సినిమాలు బాగున్నప్పటికీ ఇలా వరుసగా ఒకే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీస్తుంటే ప్రేక్షకులకి కూడా బోర్ కొట్టే అవకాశం ఉంది. అందుకే సంజయ్ లీల భన్సాలీ కొత్త జోనర్ లో సినిమా తీయాలని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు