Maheshbabu: మహేష్ బాబు చేసిన పనికి తలదించుకున్న సీనియర్ నటుడు..

Maheshbabu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఫ్లాప్ సినిమా అయినా సరే మహేష్ బాబు ని చూసి కలెక్షన్స్ భారీ రేంజ్ లో వస్తూ ఉంటాయి. మహేష్ బాబు తన కెరియర్ లో ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు.. ముఖ్యంగా ఇలాంటి విషయంలో తన తండ్రిని ఇన్స్పైర్ గా తీసుకొని చేస్తూ ఉంటారు మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు తో పని చేసినటువంటి చాలామంది నటీనటులు సైతం వారి యొక్క ఎక్స్పీరియన్స్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.

Maheshbabu: A senior actor who is proud of Mahesh Babu's work.
Maheshbabu: A senior actor who is proud of Mahesh Babu’s work.

మహేష్ బాబు పై రంగనాథ్ కామెంట్స్..

అయితే ఒక సీనియర్ నటుడు మాత్రం మహేష్ వల్ల తాను తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ గతంలో వెల్లడించారు..ఆయన ఎవరో కాదు దివంగత నటుడు రంగనాథ్.. మహేష్ బాబుతో కలిసి నిజం సినిమాలో నటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించారు. ఇందులోని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు కొన్ని ఎమోషనల్ సీన్స్, డైలాగులు కూడా చెప్పాల్సి ఉన్నదట.. అలాంటి సన్నివేశాలలో నటించడం చాలా కష్టమని, ఆ సీన్స్ మహేష్ బాబు ఎలా చేస్తారు? సరిగ్గా చేయగలరా? లేదా ?అని ఒక చిన్న అహంతో రంగనాథ్ ఉండేవారట..

మహేష్ నటనలను మెచ్చుకున్న రంగనాథ్..

అయితే మహేష్ బాబును స్క్రీన్ మీద చూసిన తర్వాత.. తాను మంచి నటుడనే అహం దిగిపోయి తలదించుకున్నానని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు నటుడు రంగనాథ్.. తన జీవితంలో మొట్టమొదటిసారిగా చివరిసారిగా తన అహాన్ని దెబ్బతీశారు మహేష్ బాబు అంటూ వెల్లడించారు. అలాంటి గొప్ప సన్నివేశాలలో మహేష్ బాబు నటించారని చెప్పారు రంగనాథ్.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

- Advertisement -

నిజం సినిమా విశేషాలు..

నిజం సినిమా విషయానికి వస్తే.. రంగనాథ్ చెప్పినట్టుగానే ఈ సినిమాలో మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చేశారు.. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త బోల్తా పడిన విషయం తెలిసిందే.. ఒక్కడు వంటి మాస్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత ఇంతటి సైలెంట్ సినిమా రావడంతో కాస్త మైనస్ గా మారిందనే వార్తలు గతంలో వినిపించాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది. మొత్తానికైతే రంగనాథ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మహేష్ బాబు సినిమాలు..

ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్ వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేస్తున్న విషయం తెలిసింది ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్కు రివిల్ చేయాలంటూ అభిమానులు కోరుతున్నప్పటికీ ఈ విషయంపై రాజమౌళి ఇంకా మౌనం వహిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు