A.M Rathnam : ఇక్కడ లాస్ అయిందంతా అక్కడ కవర్ చేసుకున్నాడు..!

A.M Rathnam : తెలుగు, తమిళంలో ఒకప్పుడు భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాత ఏఎం రత్నం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారతీయుడు, ఖుషి, వంటి బడా చిత్రాలు ఈయన బ్యానర్ లో వచ్చిన చిత్రాలే. విజయ్, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి ఎంతో మంది సూపర్‌ స్టార్స్ తో సినిమాలు నిర్మించిన ఏఎం రత్నం గత కొంత కాలంగా సైలెంట్ అయ్యాడు. ఏడేళ్ల కింద గోపీచంద్ ఆక్సిజన్ సినిమా చేసిన ఏఎం రత్నం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇతర విషయాల కారణంగా సినిమాల నిర్మాణానికి కొన్నాళ్లు దూరం అయ్యాడు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్‌ ప్రోత్సాహంతో పాటు, సన్నిహితుల వెన్నుదన్నుతో తిరిగి నిర్మాణంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రంగం పై ఏఎం రత్నంకు ఉన్న ప్రేమ అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కంటెంట్ బాగుంటే నిర్మాతగా తాను ఏం చేయాలో అంతా చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు నిర్మిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఉన్నది అంతా కూడా హరిహర వీరమల్లు సినిమా కోసం ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది.

డిలే కారణంగా పెరిగిపోయిన బడ్జెట్..?

అయితే ఎపి లో ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారంలో ఉన్నాడని తెలిసిందే. దానివల్ల పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం అవుతోంది. దాంతో ఏఎం రత్నం గారి ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు దాటిపోయి మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకోవడంతో మరింత బడెజ్ట్ పెరిగే చాన్సు ఉంది. ఎందుకంటే కొత్త డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఎంటర్ అవడం వల్ల సినిమా మేకింగ్ లో కొంత వరకు ప్లాన్స్ చేంజ్ అవుతాయి. అయితే ఇలాంటి సమయంలో ఏఎం రత్నం కి కోలీవుడ్ మూవీ గిల్లి ఊపిరినిచ్చింది. ఈయన నిర్మించిన గిల్లీ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సౌత్‌ మూవీ కూడా రీ రిలీజ్ లో దక్కించుకోని రికార్డ్‌ స్థాయి వసూళ్లను గిల్లీ దక్కించుకుంది.

ఇక్కడ లాస్ అయితే అక్కడ కవర్ చేసుకున్నాడు..!

అయితే గిల్లి సినిమా కోలీవుడ్ లో రెండు వారాల కింద రీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు అందుకుంది. ఇక ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం ఏకంగా రూ.30 కోట్ల రూపాయలను గిల్లీ మూవీ దక్కించుకుంది. దాంతో నిర్మాత ఏఎం రత్నం(A.M Rathnam) ఫుల్‌ జోష్ లో ఉన్నాడు. ఇదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఏంటి… క్రిష్ వదిలేశాడు, పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నాడు అనుకుంటున్న సమయంలో జ్యోతి కృష్ణ బాధ్యతలు చేపట్టాడు. మిగిలి ఉన్న సినిమాను జ్యోతి కృష్ణ కచ్చితంగా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీస్తాడు అనేందుకు సాక్ష్యంగా తాజాగా విడుదల అయిన టీజర్ తో నమ్మకమొచ్చింది. ఇక గిల్లీకి రూ.30 కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం తో పాటు హరి హర వీరమల్లు టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఏఎం రత్నం నిర్మాతగా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ హరిహరవీరమల్లు ఓవర్ బడ్జెట్ కాగా, ఆ సినిమా ద్వారా లాస్ అయ్యే కాస్త మొత్తాన్ని గిల్లి ద్వారా కవర్ చేసుకున్నాడని తెలుస్తుంది. అక్కడ బయ్యర్ల షేర్ పోనూ ఏఎం రత్నం కు కనీసం ఐదారు కోట్లు చేతిలోకి వస్తుంది. ఇక హరిహర వీరమల్లు ఎలక్షన్లు పూర్తి కాగానే త్వరగా స్టార్ చేసి తొందరగా షూటింగ్ ఫినిష్ చెసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు