Bigg Boss 8: త్వరలో ప్రారంభం.. పూర్తి వివరాలు..!

Bigg Boss 8.. తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ వరల్డ్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7వచ్చి సూపర్ హిట్ అయింది. విన్నర్ గా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్ దీప్ ను ప్రకటించడం వివాదం కాగా అయినా సరే ఈ షో భారీ విజయాన్ని దక్కించుకోవడం గమనార్హం.. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 6 వరస్ట్ సీజన్ గా నిలవడంతో ఆ తప్పులు మళ్ళీ జరగకుండా సీజన్ 7 విషయంలో నిర్వహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. అందుకు తగ్గట్టుగానే భారీ అంచనాల మధ్య వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది… ఇకపోతే అందరూ ఊహించినట్టు ప్రేక్షకుల ఓటింగ్ ను బట్టి కాకుండా.. రికమండేషన్ పద్ధతిలో ఎలిమినేషన్స్ , విన్నర్లను ప్రకటించడం లాంటిది చేశారు.. కానీ ఇది కాస్త పక్కన పెడితే సీజన్ 7 కి మంచి ఆదరణ లభించింది.. సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వడంతో ఓటీటీ ఉంటుందని కూడా అందరూ అనుకున్నారు.. అయితే ఓటీటీ కి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో మళ్లీ ఆ సాహసం చేయలేదు..

Bigg Boss 8
Bigg Boss 8

బిగ్ బాస్ సీజన్ 8 మొదలయ్యేది అప్పుడే..
బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి సన్నాహాలు మొదలయ్యాయి.. ప్రస్తుతం స్టార్ మా చానల్లో “నీతోనే డాన్స్” అనే కార్యక్రమం నడుస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు సమాచారం.. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయింది.. కానీ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యం చేశారు.. కానీ సూపర్ సక్సెస్ అయ్యింది ..ఇక సీజన్ 8 ని కూడా కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నీతోనే డాన్స్ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం ..

బిగ్ బాస్ 8 లో 40 మంది కంటెస్టెంట్స్..
అయితే ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక అనేది చాలా కీలకంగా మారనుందట. ప్రతి సీజన్ లా కాకుండా ఈసారి ఏకంగా 40 మందిని కంటెస్టెంట్స్ గా తీసుకోబోతున్నారట. ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి బిగ్ బాస్ హౌస్ ని ఒక చిన్న సైజ్ హాస్టల్ లాగా మార్చబోతున్నారనేది తాజా వార్త.. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో 20 మంది ఉంటేనే విచిత్రంగా జనాలు చూస్తారు.. అలాంటిది 40 మంది అంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. హౌస్ లో 20 మంది ఉంటేనే నానా గొడవలు, రచ్చలు చేస్తూ హౌస్ ను బ్రష్టు పట్టించే కంటెస్టెంట్లు.. ఇప్పుడేకంగా 40 మంది వస్తున్నారు అంటే ఇక ఎంత గందరగోళంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. మరి తాజాగా అందుతున్న అంచనాల ప్రకారం ఇదే నిజమవుతుందా లేక మిగతా సీజన్ ల లాగే 14 మందితోనే సరి పెడతారా అన్నది తెలియాలి. ఇకపోతే హోస్ట్ గా ఈసారి నాగార్జున చేస్తారా లేక కొత్తవారు వస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి పూర్తి విషయాలు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు