RC16 : జిమ్ లో బిగ్ బాస్ హౌస్మేట్ కసరత్తులు.. దాని కోసమేనా?

RC16 : స్టార్ మా లో బిగ్‌బాస్ సీజన్- 7లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆటతో తన మాటతో అదరగొట్టిన అర్జున్ అంబటి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అగ్నిసాక్షి, దేవత వంటి సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ నటుడు, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 7 లో మరింత ఫేమస్ అయ్యాడు. ఈ సీజన్లో గ్రాండ్ ఫినాలే వరకూ వెళ్లిన అర్జున్ ఆరో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి బిగ్‌బాస్‌ లో అందరిలానే నార్మల్ కంటెస్టెంట్‌గా వెళ్లి ఉంటే అర్జున్ ఖచ్చితంగా టైటిల్ కొట్టేవాడని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఫిజికల్ గేమ్స్, నామినేషన్స్‌లో అర్జున్ మాములుగా పెర్ఫామ్ చేయలేదు. అయితే బిగ్‌బాస్ టైటిల్ మిస్ అయినా క్రేజీ సినిమా ఆఫర్ అయితే అర్జున్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (RC16) సినిమాలో నటించే అవకాశం.

బుచ్చిబాబు కోసం జిమ్ లో..

అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో గ్రాండ్ ఫినాలేకి వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్‌బాస్ స్టేజ్‌పైనే అర్జున్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. “నువ్వు బయటికి రాగానే రామ్ చరణ్ గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నావ్. నీ కోసం ఓ మంచి పాత్ర సిద్ధంగా ఉంది” అంటూ బుచ్చిబాబు ప్రకటించారు. దీంతో అర్జున్ ఫుల్ ఖుషీ అయ్యాడు. ఇక రీసెంట్ గా RC 16 మూవీ ప్రారంభోత్సవం కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక తాజాగా అర్జున్ అంబటి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో తన ట్రైనర్ వెంకట్‌ నేతృత్వంలో అర్జున్ జిమ్ చేస్తూ కనిపించాడు అయితే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టినప్పుడు కూడా అర్జున్ చాలా ఫిట్‌గా కనిపించాడు. ఇప్పుడు అంతకంటే ఫిట్‌గా, గట్టిగా బాడీ బిల్డప్ చేస్తున్నాడు. ఇక జిమ్ చేస్తున్న అర్జున్ ని చూసిన నెటిజన్లు “ఇది రామ్ చరణ్ సినిమా కోసమేనా, ఏ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే చరణ్ బుచ్చిబాబు సినిమా మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. కానీ బుచ్చిబాబు తన టీమ్ తో ఇప్పటినుంచే షూటింగ్ పనుల్లో ఉన్నాడని అందర్నీ ఆ మేరకు సిద్ధం చేస్తున్నాడని సమాచారం. అలాగే అర్జున్ కి కూడా సినిమా కోసం రెడీ గా ఉండమని అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

- Advertisement -

సీరియల్స్‌తో పాటు సినిమాలు..

ఇక అంబటి అర్జున్ అగ్ని సాక్షి, దేవత వంటి హిట్ సీరియల్స్‌తో బుల్లితెర ఆడియన్స్‌‌కి బాగా గుర్తుండిపోయాడు. అలాగే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో కూడా అర్జున్ యాక్ట్ చేశాడు. నిజానికి సీరియల్స్‌లో ఎంట్రీ ఇచ్చే ముందే చిత్రాల్లో అర్జున్ ‘అర్ధనారి’ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత సౌఖ్యం, అశ్వమేధం లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిశాడు. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చినప్పటి నుండి సీరియల్స్‌తో పాటు పలు ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రామ్స్‌ లో కూడా అర్జున్ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక బిగ్‌బాస్‌కి ఎంట్రీ ఇవ్వడంతో అటు సీరియల్ ఆడియన్స్‌తో పాటు యూత్ కి కూడా బాగా కనెక్ట్ అయిపోయాడు అర్జున్. ఇక ఇప్పుడు మరోసారి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు అర్జున్. ఇక రీసెంట్ గా సుందరి, తీస్ మార్ ఖాన్ చిత్రాల్లో నటించిన అంబటి అర్జున్ కి RC16లో మంచి పాత్ర పడితే మాత్రం అర్జున్ సినిమాల్లో కెరీర్ ఊపందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు