Prabhas: ఇలా చేస్తే ప్రభాస్ ను కలిసే అవకాశం.. త్వరపడండి..!

Prabhas.. అభిమానులకు శుభవార్త.. తాజాగా ప్రభాస్ ను కలిసే అవకాశం మీ కోసం అంటూ చిత్ర బృందం ఒక ప్రకటన జారీ చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ.. కల్కి 2898 AD.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.అయితే చిత్ర బృందం త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టనున్నట్లు సమాచారం.. ఇక అందులో భాగంగానే ప్రభాస్ ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఇందులో ప్రభాస్ ను కలిసే అవకాశం అభిమానులకు రానుంది.

జోరుగా ప్రమోషన్స్ మొదలు..

Prabhas: If you do this, there is a chance to meet Prabhas.. Hurry up..!
Prabhas: If you do this, there is a chance to meet Prabhas.. Hurry up..!

జూన్ 27వ తేదీన మొత్తం 22 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే త్వరలోనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభిస్తూ ఉండగా.. డిఫరెంట్ స్ట్రాటజీతో ప్రమోషన్స్ ను డిజైన్ చేస్తున్నారట.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్స్ అన్నీ కూడా సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.. ప్రమోషన్స్ ను కూడా వేరే లెవెల్ లో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ మేరకు కల్కి ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ మీట్ ను చిత్ర బృందం ఏర్పాటు చేయబోతుందట. ప్రభాస్ కి గ్రీటింగ్ చెప్పేందుకు గాను ఈ మీట్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ప్రభాస్ ని కలిసే అవకాశం..

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ ను నేరుగా అభిమానులు కలవవచ్చు.. నెక్స్ట్ వీక్ నుంచి ప్రభాస్ ఈ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్న నేపథ్యంలో మీరు కూడా ఈ మీట్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మరీ ప్రభాస్ ని కలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ మీట్ ఎక్కడ జరగబోతోంది? ఎప్పుడు జరగబోతోంది? అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి త్వరలోనే ఈ విషయాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా ప్రమోషన్స్ లో భాగంగా నేషనల్ మీడియాకు కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారట.. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకుని వస్తున్న ఈ చిత్రం ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఇంకొన్ని రోజులు ఆగితే ఖచ్చితంగా ప్రభాస్ ని మీట్ అయ్యే అవకాశాన్ని అభిమానులు పొందవచ్చు.

- Advertisement -

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పోటీకి దింపబోతున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాకి పోటీగా చిరంజీవి విశ్వంభర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ స్పిరిట్, సలార్ 2 వంటి చిత్రాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంటున్నారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు