Sneha: వేసిన బట్టలు మళ్లీ వేయను.. కారణం అదే..!

Sneha.. అలనాటి అందాల తార సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి హీరోలకి అక్కగా, వదినగా మంచి మంచి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.ఇప్పటికీ తన అందంలో ఏమాత్రం మార్పులు రాలేదని చెప్పాలి. మంచి ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ.. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అంతేకాదు స్మైల్ క్వీన్ అనే పేరు కూడా ఈమె సొంతం చేసుకుంది.. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన స్నేహ.. తమిళంలో కూడా అజిత్ , కమల్ హాసన్, విజయ్, సూర్య , విక్రమ్, ప్రశాంత్, ధనుష్ వంటి అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

బట్టల విషయంపై క్లారిటీ..

Sneha: I will not re-wear the clothes.. That's the reason..!
Sneha: I will not re-wear the clothes.. That’s the reason..!

ఇక ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ జోడి డాన్స్ అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.. ఇకపోతే 2009లో తమిళంలో అచ్చముందా అచ్చముందా అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో తన భర్త ప్రసన్నకుమార్ కూడా నటించారు ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 2012లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఒక పాప, బాబు ఉన్న విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉండగా తాజాగా నటి స్నేహ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బట్టల విషయంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

వేసిన డ్రెస్ మళ్ళీ వేయను..

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ మాట్లాడుతూ..ఒక మ్యాగజైన్ వాళ్ళు.. స్నేహా తరచుగా ఒకే దుస్తులను ధరిస్తుంది .. ఆమె ధరించడానికి వేరే బట్టలు లేవేమో.. అంటూ రాసింది… ఇక ఆ సమయంలో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది నా దుస్తులపై నాకు చాలా విమర్శలు వచ్చాయి. అందుకే ఆ కారణంగానే నేను ఒకసారి ధరించిన బట్టలను మళ్లీ ధరించకూడదని నిర్ణయించుకున్నాను. ఇక అందులో భాగంగానే నేను ఇప్పటివరకు వేసిన దుస్తులను మళ్లీ వెయ్యలేదు. ఇక ఒకసారి ధరించి వదిలేసిన బట్టలను నేను ఆ తర్వాత తెలిసిన వారికి, నా స్నేహితులకు ఇస్తూ ఉంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది స్నేహ.. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది విన్న నెటిజన్స్ స్నేహా సంపాదనలో సగం బట్టలకే ఖర్చయిపోతుందేమో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

స్నేహ కెరియర్..

ఇక స్నేహ విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగులో వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె వివాహమనంతరం పిల్లల కోసం ఇండస్ట్రీకి దూరమయింది.. తర్వాత పిల్లల పెద్దవాళ్లు కావడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈమె వినయ విధేయ రామ సినిమాతో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ సినిమా తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది స్నేహ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు