GOAT : దళపతి సినిమాకు భారీ డిమాండ్! లాస్ట్ సినిమా అని చెప్పడం వల్లేనా?

GOAT : కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తమిళ నాటే పరిచయమైన ఈ హీరో సౌత్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని సంపాదించాడు. వరుస హిట్లతో దూకుడుమీదున్నాడు. లాస్ట్ ఇయర్ లియో సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇళయదళపతి విజయ్ హీరోగా కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ GOAT (గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం). అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్నీ AG ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 200 కోట్లకి పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీపై తమిళనాట మాత్రమే కాదు సౌత్ ఇండియా వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలిసిందే. సోషల్ మీడియా లో భారీ వ్యూస్ సాధించింది ఆ సినిమా. కానీ ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమా కు నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా భారీ బిజినెస్ జరుగుతుంది. విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ రేంజ్ లో రికార్డ్ బిజినెస్ జరుగుతుంది.

దళపతి కెరీర్ హైయెస్ట్ గా గోట్ నాన్ డిజిటల్ బిజినెస్..

ఇక అసలు విషయానికి వస్తే విజయ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డిజిటల్ బిజినెస్ పరంగా భారీగా జరుగుతుంది. థియేట్రికల్ బిజినెస్ కంటే, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎక్కువ అవుతుండడం గమనార్హం. GOAT మూవీ తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఈ కారణంగా ప్రస్తుతం చేస్తోన్న GOAT మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాపై బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అన్ని భాషలకి కలిపి 150 కోట్ల వరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు మూవీ శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా షాక్ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. డిజిటల్ ఎంటటైన్మెంట్ వచ్చిన తర్వాత టెలివిజన్ ప్రీమియర్ లకి ఆదరణ తగ్గింది. దీంతో శాటిలైట్ రైట్స్ కోసం టీవీ ఛానల్స్ ఎక్కువ మొత్తం పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. అయితే GOAT మూవీ శాటిలైట్ రైట్స్ ని జీ నెట్ వర్క్ ఏకంగా 90 కోట్లకి కొనుగోలు చేసిందంట. జీ నెట్ వర్క్ ఈ మధ్యకాలంలో శాటిలైట్ రైట్స్ కోసం అత్యధిక పెట్టుబడి పెట్టిన సినిమా GOAT అని తెలుస్తోంది. అన్ని భాషలకి సంబందించిన హక్కుల కోసం ఈ మొత్తం చెల్లించడానికి జీ నెట్ వర్క్ రెడీ అయ్యిందంట. ఈ లెక్కలు చూసుకుంటే 240 కోట్ల వరకు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా ఈ మూవీ సంపాదించింది.

Huge digital business demand for Thalapathy Vijay's movie GOAT

- Advertisement -

లాస్ట్ సినిమా అని చెప్పడం వల్లే?

ఇక విజయ్ గోట్ సినిమాకు కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ రేంజ్ లో బిజినెస్ రిలీజ్ కి చాలా రోజుల ముందే జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక థియేటర్స్ లో 150 కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే డిజిటల్ రైట్స్ కంటే ఎక్కువ. మొత్తానికి నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తోనే GOAT చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని అర్ధం చేసుకోవచ్చు. అయితే త్వరలో ఇళయదళపతి విజయ్ తమిళ రాజకీయాలలో బిజీ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పార్టీ పేరు ఎనౌన్స్ చేశారు. రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత సినిమాలు పూర్తిగా వదిలేస్తానని విజయ్ చెప్పారు. ఈ కారణంగా విజయ్ లాస్ట్ సినిమా అని చెప్పడం వల్లే ఈ సినిమాకి ఈ రేంజ్ లో డిమాండ్ వస్తుందని, కంటెంట్ పరంగా మాత్రం సినిమాపై పెద్దగా నమ్మకం లేదని, అలాగే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ కూడా అంత బాగా లేదని నెటిజన్లు అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు