Mollywood : మలయాళం హిట్ సినిమాలకు డిజిటల్ లో రివర్స్ లో నెగిటివ్ రెస్పాన్స్.. అతి చేశారట!

Mollywood : గత కొంత కాలంగా మలయాళ ఇండస్ట్రీ నుండి వరుస బెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిసిందే. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ రిజల్టే నమోదవుతుంది. పైగా మామూలుగానే మలయాళం సినిమాలన్నీ, తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కుతాయి. దాని తగ్గట్లే వసూళ్లు కూడా రాబడతాయి. కానీ కొన్నేళ్లుగా మాలీవుడ్ సినిమాలు కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ ఏడాది అక్కడి నుంచి వచ్చిన సినిమాలు భారీ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. జనవరి నుంచే మలయాళ చిత్రాల హవా మొదలైంది. అలా విడుదలైన వరుస సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో భ్రమయుగం, ప్రేమలు, అన్వేషిప్పిన్ కండెతుమ్, మంజుమ్మల్ బాయ్స్ విడుదల అయ్యాయి. ఒకరకంగా ఆ నెలలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక ప్రేమలు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించింది. మంజుమ్మల్ బాయ్స్. రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి మాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఆడుజీవితం కూడా రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. ఫహద్ ఫాజిల్ ఆవేశంతో పాటు పలు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయవంతమయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది ఆరంభంలోనే మాలీవుడ్ నుండి నాలుగు వంద కోట్ల సినిమాలు రాగా, ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా వచ్చింది.

డిజిటల్ లో రెస్పాన్స్ రివర్స్..

ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు రీసెంట్ గా విజయం సాధించిన ఈ మలయాళ (Mollywood) సినిమాలన్నీ వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా పలు మూవీలు వసూలు చేసినా, ఇప్పుడు ఓటీటీల్లో వచ్చాక వాటిపై ఆడియన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, ఆవేశం సినిమాల కోసం ఇప్పుడు నెట్టింట అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలు అంత క్లాసిక్ ఏమి కావని, కాస్త అతి గా ఓవర్ రేటెడ్ ఆయ్యాయని అభిప్రాయపడుతున్నారు. సిల్లీ కామెడీ, రొటీన్ సీన్స్ తో తెరకెక్కిన ప్రేమలు మూవీకి, అంతలా ప్రశంసలు అందుకోవడానికి కారణమేంటోనని కొందరు ఓటిటి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఊసరవెల్లితో పాటు పలు తెలుగు సినిమాల కామెడీ సీక్వెన్సులే, ఆవేశం మూవీలో ఉన్నాయని చెబుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ బాగానే ఉన్నా, అంత రేటింగ్ దక్కించుకునే క్లాసిక్ చిత్రం మాత్రం కాదని అంటున్నారు.

Negative response to latest Mollywood movies on digital

- Advertisement -

సోషల్ మీడియా అతి వల్లే?

అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మలయాళ సినిమాల కంటెంట్ ఏమి అంత గొప్పగా లేదని అంటున్నారు. పైగా ఆయా సినిమాల్లోని కొన్ని సీన్స్ లో స్క్రీన్ ప్లే బలంగా లేదని నెటిజన్లు చెబుతున్నారు. మరికొన్ని సీన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేయడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని అంటున్నారు. కొందరు నటీనటుల యాక్టింగ్ అదిరిపోయినప్పటికీ.. వేరే లెవెల్ లో మాత్రం లేదని చెబుతున్నారు. ఏదేమైనా ఆవేశం, ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ చిత్రాలకు ఓటిటి లో మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించినప్పటికీ, ఆ మూడు సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో మాత్రం మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇక ఈ ఓటిటి స్పందన చూసాక తెలుగు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో చేసిన అతి వల్లే ఈ సినిమాలు రిలీజ్ టైం లో బాగా ఆడాయని నెటిజన్లు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు