Sana Begum: నటి సనా భర్తకు గుండెపోటు..పోస్ట్ వైరల్..!

Sana Begum: ప్రముఖ నటి సనా బేగం ఒకప్పుడు వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి భారీ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ఇప్పుడు పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది సనా బేగం.నిత్యం తన ఫ్యామిలీ విషయాలను , సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువలో ఉండే సనా బేగం ఏమైందో తెలియదు కానీ.. గత కొన్ని రోజులుగా నెట్టింట యాక్టివ్ గా కనిపించడం లేదు.. ఈ విషయంపైనే నెటిజన్లకు క్షమాపణలు చెబుతూ అసలు విషయాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

గుండెపోటుకు గురైన సనా భర్త..
గత ఐదారు రోజులుగా అసలు సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా పెట్టడం లేదు.. పైగా నిన్న రంజాన్ పండుగ.. కానీ ఇంతవరకు సనా ఇన్ స్టా ఖాతాలో ఒక పోస్ట్ కూడా లేదు.. దీంతో అసలు ఎందుకు యాక్టివ్ గా లేదు అంటూ అభిమానులు సైతం కంగారు పడిపోయారు.. ఏకంగా ఆమెను ట్యాగ్ చేస్తూ ఎందుకు ఒక పోస్ట్ కూడా పెట్టడం లేదంటూ కారణాలు అడుగుతూ మెసేజ్లు కూడా చేస్తున్నారు.. ఇక ఫాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు క్లారిటీ ఇస్తూ అసలు విషయాన్నీ బయటపెట్టింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడానికి గల కారణాన్ని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇన్స్టా, యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండనందుకు నన్ను క్షమించండి.. గత కొద్ది రోజుల క్రితం నా భర్తకు గుండెపోటు వచ్చింది..వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గండం తప్పింది. అల్లా దయవల్ల సర్జరీ విజయవంతంగా జరిగి.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ ఇన్స్టా స్టోరీ లో రాసుకుంది.. ఇది చూసిన అభిమానులు సనా బేగం భర్త త్వరగా కోలుకోవాలని కామెంట్లు కూడా చేస్తున్నారు..

- Advertisement -

సనా బేగం సినిమా కెరియర్..
తెలుగు , తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో సుమారుగా 600కు పైగా సినిమాలలో నటించిన ఈమె ఇప్పటికీ వెండితెరపై కీలక పాత్రలు పోషిస్తూ సినిమా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. అమ్మ, అత్త, వదిన, అక్క ఇలా ఎలాంటి పాత్రలోనైనా సరే ఆకట్టుకునే సనా బేగం మొదట డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక సినిమాలలో ఒకవైపు నటిస్తూనే.. మరొకవైపు సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకొని మరింత బిజీగా మారింది. సనా బేగం ఇక సీరియల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న గువ్వా గోరింక అనే సీరియల్ లో హీరోకి తల్లి పాత్రలో నటిస్తోంది. ఇక ఇక్కడ తన అద్భుతమైన నటనతో ఎంతోమంది బుల్లితెర ఆడియన్స్ హృదయాలను కూడా దోచుకుంది సనా బేగం. మొత్తానికి అయితే తన భర్తకు గుండెపోటు వచ్చిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచిన ఈమె ప్రస్తుతం ఆయన కోలుకున్నారు అని చెప్పి ఊరటనిచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Sameera Sherief (@sameerasherief)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు