Gangs Of Godavari OTT : విశ్వక్ సేన్ కెరీర్ లో హైయెస్ట్ రికార్డ్ ఇది.. భారీ ధరకు ఓటిటి రైట్స్..

Gangs Of Godavari OTT : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ సినిమాతో మంచి హిట్టు కొట్టిన మాస్ కా దాస్ ఈ ఇది కూడా గామి తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక కెరీర్ లో బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న విశ్వక్ సేన్ త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నుండి ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ గాని, ట్రైలర్ గాని మంచి రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి. పైగా సాంగ్స్ కూడా మంచి హిట్టయ్యాయి. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమాపై ముందునుండి క్రేజీ అంచనాలున్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది. థియేట్రికల్ బిజినెస్ తో పోటీ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుండడం విశేషం.

గోదావరి కుర్రాళ్ళకి హై డిమాండ్..

ఇక మే నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమానే మేజర్ హాట్ ఫేవరేట్ మూవీ అని చెప్పాలి. టాక్ ఏమాత్రం బాగున్నా మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ ని సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమా బిజినెస్ విశ్వక్ సేన్ కెరీర్ లో భారీ గా జరుగుతుండడం విశేషం. ఇక సినిమా మీద మంచి క్రేజ్ ఉండటం అలాగే విశ్వక్ సేన్ కూడా వరుస హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండటంతో ఈ సినిమా బిజినెస్ పరంగా మంచి జోరుని చూపెడుతూ ఉండగా, తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల వరకు బిజినెస్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక తాజాగా రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే, డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటుకి అమ్ముడు అయ్యి సంచలనం సృష్టించింది.

కెరీర్ లో బెస్ట్ రేటు..

ఇక విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs Of Godavari) మూవీ కి తాజాగా తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ డిజిటల్ బిజినెస్ జరిగింది. ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి మూవీని ఆల్మోస్ట్ 14 కోట్ల రేంజ్ లో రేటు ని చెల్లించి నెట్ ఫ్లిక్స్ వారు సినిమా హక్కులను సొంతం చేసుకున్నారట. విశ్వక్ సేన్ కెరీర్ లో ఇది హైయెస్ట్ రికార్డ్ కాగా, ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి బడ్జెట్ మొత్తం కూడా రికవరీ అయ్యిందన్న టాక్ ఉంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగే అవకాశం ఎంతైనా ఉండగా, సినిమా ఈ నెల 17న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండటంతో టాక్ ఏమాత్రం బాగున్నా కూడా మరో సాలిడ్ హిట్ ని విశ్వక్ సేన్ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు