Gangs of Godavari : విశ్వక్ పుట్టినరోజున డబుల్ ట్రీట్… “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రిలీజ్ డేట్ ఫిక్స్

 

Gangs of Godavari : యంగ్ హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆయన హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ “మెకానిక్ రాకి”కి సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి డబుల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. మరి విశ్వక్ బర్త్ డేకు ఇచ్చిన ఈ డబుల్ ట్రీట్ విశేషాలు ఏంటి? “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఎప్పుడు థియేటర్లలోకి రాబోతోంది? అంటే…

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఎట్టకేలకు మేలో…

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా “గామి” మూవీతో థియేటర్లోకి వచ్చాడు. ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రిలీజ్ పై దృష్టి పెట్టాడు ఈ యంగ్ హీరో. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి నేడు విశ్వక్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా చల్ మోహన్ రంగా ఫేమ్ చైతన్య కృష్ణ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ మూవీని ముందుగా డిసెంబర్ 8న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు.

- Advertisement -

పైగా అదే వారంలో నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు రిలీజ్ కావడం, వాటితో పాటు డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్ ఉండడంతో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” వాయిదా పడింది. తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ సమయంలో “ఈగల్” అడ్డొచ్చింది. దీంతో ఎట్టకేలకు మార్చ్ 8న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ అప్పటికి కూడా పలు కారణాల వల్ల ఈ మూవీని వాయిదా వేయక తప్పలేదు మేకర్స్ కి. దీంతో ఆ రిలీజ్ డేట్ ను “గామి” కోసం వాడుకున్నాడు విశ్వక్. అందుకే అనూహ్యంగా, అనుకోని విధంగా “గామి” మార్చి 8న తెరపైకి వచ్చింది. తాజాగా విశ్వక్ బర్త్ డే ట్రీట్ గా రిలీజ్ చేసిన పోస్టర్లో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మే 17న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్ పుట్టిన రోజు కానుకగా ఆయన మరో మూవీ నుంచి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

మాస్ అవతార్ లో “మెకానిక్ రాకీ”

విశ్వక్ సేన్ హీరోగా, రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త మూవీ “మెకానిక్ రాకి”. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీలో విశ్వక్ మెకానిక్ గా కనిపించబోతున్నాడు. తాజాగా విశ్వక్ పుట్టినరోజు సందర్భంగా మెకానిక్ రాకీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అందులో మాస్ అవతార్ లో చేతిలో రింజ్ పట్టుకొని, సిగరెట్ కాలుస్తూ దర్శనం ఇచ్చాడు విశ్వక్. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వక్ కెరీర్లో 10వ సినిమాగా తెరకెక్కుతున్న “మెకానిక్ రాకి” మూవీ యాక్షన్, కామెడీ అంశాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతోంది. జేక్స్ బిజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు