Ramayan : సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్న ఒక వర్గం… మింగుడు పడట్లేదా?

Ramayan : బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో “రామాయణ్” ప్రత్యేకమైనది. బాలీవుడ్ లో ఎప్పటుంచొ ఈ సినిమా రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కబోతుందని వార్తలు వస్తూనే ఉండగా, ఫైనల్ గా కార్యరూపం దాల్చింది. రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతారాములుగా నటిస్తుండగా, యష్ రావణుడిగా నటిస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ అలా మొదలైందో లేదో అప్పుడే షూటింగ్ నుండి స్టిల్స్ లీక్ అవడం చర్చనీయాంశంగా మారింది. దీని పై చిత్ర యూనిట్ కూడా మండి పడ్డారు. ఇదిలా ఉండగా ఈ రోజుల్లో సినిమా సెలబ్రెటీలు వివాదాస్పద అంశాల గురించి నోరు తెరవకుండా ఉంటే మంచిదని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ఏదైనా ఇంటర్వ్యూల్లో మాటవరుసకి ఏదైనా అభిప్రాయం చెబితే, దాన్ని పట్టుకుని తీవ్ర స్థాయిలో ద్వేషం చిమ్ముతున్నారు నెటిజన్లు. అయితే అందులో మంచికి ఉంటుంది, చెడుకి ఉంటుంది. ఆయా సందర్భాలని బట్టి ట్రోల్ అవుతుంటారు. ఎప్పుడో మాట్లాడిన మాటల్ని పట్టుకుని వాళ్లు చేసే కొత్త సినిమాలకు ముడి పెట్టి నానా హంగామా చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు సాయి పల్లవి పరిస్థితి ఇలాగే తయారయింది.

పాత విషయాల్ని లాగుతున్న నెటిజన్లు..

అయితే సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణ్ (Ramayan) లో నటిస్తుందన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో అంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ సౌత్ భామ అయిన సాయి పల్లవి ని ఏరికోరి ఎంచుకున్నారంటే ఆమె టాలెంట్ ని, పేరుని బట్టే అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్ నెటిజన్ల నుండి సాయిపల్లవి కి సోషల్ మీడియాలో ఊహించని వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రెండేళ్ల కింద ‘విరాట పర్వం’ రిలీజ్ టైంలో గోవుల్ని తరలిస్తున్న ఓ ముస్లిం యువకుడి మీద హిందువులు దాడి చేయడాన్ని సాయి పల్లవి తప్పుబట్టిన విషయం తెలిసిందే. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలోని కొన్ని అంశాలతో పోలుస్తూ అక్కడ కశ్మీర్ పండిట్ల మీద దాడి తప్పయితే.. ఇక్కడ ముస్లింల మీద దాడి కూడా తప్పే కదా అని ఆమె ప్రశ్నించింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై ఇండియా వ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర వివాదం నడిచింది. ఆ తర్వాత సద్దుమణిగింది. కట్ చేస్తే ఇప్పుడు సాయిపల్లవి హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీతారాములుగా రణబీర్ కపూర్, సాయిపల్లవిల ఆన్ లొకేషన్ ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా సాయిపల్లవి మీద సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

విషయం అదా? లేక ఇదా?

అయితే సాయి పల్లవి మీద వస్తున్న ట్రోలింగ్ రోజురోజుకి ఎక్కువైపోతోంది. సాయిపల్లవి సీత పాత్రకు సూట్ కాదని.. హిందువులు పవిత్రంగా భావించే సీత పాత్రను ఆమె ఎలా చేస్తుందని.. ఆమె మలయాళీ కావడంతో సూడో సెక్యూరలిస్ట్ అని, అప్పటి ఇంటర్వ్యూ విషయాలను ప్రస్తావిస్తూ తనను టార్గెట్ చేస్తున్నారు. మొన్న ఫొటోలు లీకయ్యాక మొదలైన ఈ ట్రెండ్ అంతకంతకూ ఊపందుకుంటోంది. సాయిపల్లవి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ చిత్ర యూనిట్ లో గుబులు రేపుతోంది ఒక వర్గం. అలా అయితే రణబీర్ ని కూడా ట్రోల్ చేయాల్సిందని సౌత్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో గొడ్డు మాంసం తింటానని రణబీర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు రణబీర్ ని కూడా ఈ అంశం పట్టుకుని ట్రోల్ చేయొచ్చని కొందరు ట్రేడ్ విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ట్రోలింగ్ అయినపుడు ముందే చిత్ర నటీనటులు యూనిట్ సహా, జనాలు హర్ట్ అయ్యేలా ఏమాత్రం చేసినా సినిమా షెడ్డుకెళ్లిపోవాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. దీనిపై నిజానికి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేస్తే ఇక్కడితో తెరపడుతుందని అంటున్నారు జనాలు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు