Sai Pallavi Remuneration : రామయణ్‌కి సాయి పల్లవి కి అన్ని కోట్లు ఇచ్చారా.?

Sai Pallavi Remuneration : కస్తూరి మాన్ సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. అయితే సాయి పల్లకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ప్రేమమ్ ని చెప్పాలి. ప్రేమమ్ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ గా మలయాళం సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకులు కూడా దానిని మలయాళం లోని చూసి, ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులు పెడితే వచ్చారు. ఇప్పటికీ ప్రేమమ్ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంది అని చెప్పొచ్చు.

ప్రేమమ్ సినిమాని తెలుగులో చందు మొండేటి తెరకెక్కించాడు. నాగచైతన్య నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన పాత్రను తెలుగులో శృతిహాసన్ చేసింది. అయితే ఒరిజినల్ ప్రేమమ్ సాయి పల్లవి పాత్ర చాలామందికి గుర్తుండిపోయిందని కూడా చెప్పొచ్చు. ఇకపోతే తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ వచ్చింది సాయి పల్లవి.

శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో భానుమతి పాత్రలో కనిపించిన సాయి పల్లవి ప్రేక్షకులను తన పెర్ఫార్మన్స్ తో ఫిదా చేసింది. ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవి ఆ స్థాయి హిట్ సినిమాలు తెలుగులో పడలేదు. కానీ అవకాశాలు మాత్రం సాయి పల్లవికి ఎక్కడా తగ్గలేదు. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు వంటి సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

- Advertisement -

నాని సరసం చేసిన శ్యామ్ సింగరాయ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఆ సినిమాతో ఇంకొంచెం ఫన్డేషన్ సాయి పల్లవి క్రియేట్ చేసుకుని అని చెప్పొచ్చు. వేణు ఉడుకుల దర్శకత్వంలో వచ్చిన విరాట్ పర్వం సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో సాయి పల్లవి కనిపించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు సాయి పల్లవి నుంచి డాన్సులు ఎక్స్పెక్ట్ చేసే ఫ్యాన్స్ కి తన పెర్ఫార్మన్స్ తో ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక ప్రస్తుతం సాయి పల్లవి… చందు ముండేటి దర్శకత్వంలో నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఎక్కువ శాతం సముద్రంలో జరుగుతుంది. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన వీడియో కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచింది. ఇకపోతే ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో నితీష్ తివారి వారి తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్ కనిపించనున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సాయి పల్లవి దాదాపు పది కోట్లు వరకు రెమ్యూనరేషన్ ( Sai Pallavi Remuneration ) తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఒక ప్రాజెక్టుకు తీసుకుంటుంది. అయితే బాలీవుడ్లో సాయి పల్లవి చేస్తున్న మొదటి ప్రాజెక్టుకి 10 కోట్లు రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించిన అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు