Telugu Director : నితిన్‌ ను సెట్‌ లోనే కొట్టిన తెలుగు దర్శకుడు?

Telugu Director : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది బ్యాగ్రౌండ్ చూసుకొని ఇండస్ట్రీలో అడుగు పెడితే… మరి కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తున్నారు. వెబ్ సిరీస్లలో నటించి… యూట్యూబ్లో పాపులర్ అయిన తర్వాత కొంతమంది హీరోలుగా మారుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో మొదటి నుంచి కష్టపడి హీరోగా ఎదిగిపోతున్నారు. అలాంటి హీరోలలో నితిన్ ఒకరు.

తెలంగాణకు చెందిన హీరో నితిన్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. 2002 సంవత్సరంలో జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హీరో నితిన్. హీరోగా చేసిన తొలి సినిమాని మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. ఈ సినిమాను దర్శకుడు తేజ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో దర్శకుడు తేజ బాగా పాపులర్. అలాంటి నేపథ్యంలోనే ఆదర్శకుడు తేజ చేతిలో పడ్డాడు హీరో నితిన్. దీంతో జయం సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. జయం సినిమాలో హీరోగా నితిన్ చేయగా… హీరోయిన్గా సదా చేసిన సంగతి తెలిసిందే.

జయం సినిమా సక్సెస్ అయిన తర్వాత నితిన్ వెనక్కి చూసుకోలేదు. వరుసగా అన్ని హిట్లు కొట్టుకుంటూ వెళ్ళాడు. జయం సినిమా తర్వాత నితిన్ కెరీర్లో దిల్ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా కూడా యూత్ ను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఏకంగా జక్కన్న దర్శకత్వంలో చేశాడు హీరో నితిన్. ఎస్.ఎస్ రాజమౌళి మరియు హీరో నితిన్ కాంబినేషన్లో సై సినిమా వచ్చింది. ఈ సినిమా కాలేజీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన కథ. పూర్తిగా రక్బీ ఆట ఇందులో ఉంటుంది.
ఈ సినిమా కూడా బంపర్ హిట్ అయింది.

- Advertisement -

అయితే సై సినిమా తర్వాత హీరో నితిన్… పెద్దగా సక్సెస్ అందుకోలేదు. వరసగా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. సాయి తర్వాత తీసిన ధైర్యం, టక్కరి, ఆటాడిస్తా, హీరో, విక్టరీ, ద్రోణ, ఈ సినిమాలేవి పెద్దగా ఆడలేదు. కానీ ఇష్క్ సినిమాతో 2012లో మళ్ళీ గాడిలో పడ్డాడు హీరో నితిన్. టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ మరియు హీరో నితిన్ కాంబినేషన్లో ఇష్క్ సినిమా వచ్చింది. ఈ సినిమా చాలా మందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంటనే గుండెజారి గల్లంతయింది సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు.

అలాగే భీష్మ లాంటి బంపర్ హిట్ కూడా ఇటీవల అందుకున్నాడు. మళ్లీ వరుస అట్టర్ ఫ్లాప్ లతో తడబడుతున్నాడు హీరో నితిన్. అలాంటి హీరో నితిన్ గురించి ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో నితిన్ ను ఓ దర్శకుడు ( Telugu Director ) కొట్టాడట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆదర్శకుడు ఎవరో కాదు తేజ. తేజ మరియు హీరో నితిన్ కాంబినేషన్లో జయం సినిమా వచ్చింది. ఈ సినిమా సమయంలో ఒక సీన్ సరిగా రాకపోతే హీరో నితిన్ ను కొట్టాడట తేజ. వాస్తవానికి తేజకు హీరోలను అలా కొట్టడం అలవాటే. అందుకే నితిన్ కూడా గమ్ముగా కూర్చున్నాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు