Kalki Movie Update : అదే నెలలో కల్కి సినిమా రిలీజ్

Kalki Movie Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా తెలుగు సినిమాల్లో తనకంటూ కొంత గుర్తింపును సాధించుకొని, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నాడు ప్రభాస్. అయితే ఒక్కో నటుడు ఒక్కో సినిమా కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు అయితే ఒక సరైన ఇమేజ్ రాకముందు ఒక సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు అయినా వేచి ఉండొచ్చు. కానీ స్టార్ హీరోగా కూడా మంచి గుర్తింపును సాధించిన తర్వాత ఒక సినిమా కోసం ఐదేళ్లు వెయిట్ చేయడం అంటే అది కేవలం ప్రభాస్ కి చెల్లింది.

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ బాహుబలి సినిమా కోసం ఖర్చుపెట్టిన రోజులు వృధా కాలేదు. దేశమంతట ప్రభాస్ కి అభిమానులను తెచ్చిపెట్టింది బాహుబలి సినిమా. కేవలం తెలుగు సినిమా యొక్క స్థాయిని మాత్రమే పెంచకుండా తెలుగు సినిమా యొక్క గుర్తింపును ప్రపంచానికి చాటి చెప్పేలా చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా సత్తా ఏంటి అని చాలామందికి తెలిసొచ్చింది.

బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ కు సరైన హిట్ సినిమా పడలేదు అని చెప్పొచ్చు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలామందికి టెక్నికల్ గా ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగులో ఈ సినిమాకి సరైన ఆదరణ దక్కకపోయినా కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు అని చెప్పొచ్చు. సాహో సినిమా తర్వాత ఇప్పటివరకు సుజిత్ నుంచి ఒక సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం సుజిత్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధేశ్యాం సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అనుకున్నారు. ఇది ఒక ఎపిక్ లవ్ స్టోరీ అవుతుందని ఊహించారు కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా కూడా ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. ఈ వరుస డిజాస్టర్స్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా కల్కి ( Kalki Movie Update ). ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుంది. కమల్ హాసన్, అమితాబచ్చన్ వంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ఇంకా పెండింగ్లోనే ఉండటం వలన ఈ సినిమాను 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారకి ప్రకటన రావాల్సి ఉంది. మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా స్థాయిని మరి కొంచెం ముందుకు తీసుకెళ్లే సినిమా అవుతుంది అని చాలామంది నమ్మకం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు