Kalki 2898 AD : “కల్కి” రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ కు కారణం ఇదే

పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిలిం “కల్కి 2898 ఏడి”. ప్రభాస్ కెరీర్ లోనే కాస్ట్లీ మూవీగా రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ మే 9న రిలీజ్ కాబోతుందని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఫిలిం నగర్ సర్కిల్స్ లో మాత్రం ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. పలుమార్లు మేకర్స్ ఆ పుకార్లను కొట్టి పడేసి, అనుకున్న విధంగా మే 9న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ “కల్కి” మూవీ వాయిదా తప్పదు అనే టాక్ మాత్రం ఇండస్ట్రీలో తగ్గడం లేదు. ఒకవైపు చిత్ర బృందం తప్పకుండా రిలీజ్ చేస్తామంటే, మరోవైపు రూమర్స్ మాత్రం అది అయ్యే పని కాదని చెప్తున్నాయి. మరి ఇంతకీ “కల్కి” మూవీ రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న ఈ కన్ఫ్యూజన్ కు కారణం ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

డెడ్ లైన్ చేరుకుంటారా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డ్రామా “కల్కి 2898 ఏడి”. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. కమల్ హాసన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే 2024 మే 9న “కల్కి”ని రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ డెడ్ లైన్ ను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ మరోవైపు మాత్రం “కల్కి” వాయిదా పడే అవకాశం ఉందన్న రూమర్లు ఆగడం లేదు. అసలు ఈ రూమర్లు ఎందుకు వస్తున్నాయి అంటే సీజీ వర్కే కారణమని తెలుస్తుంది.

“కల్కి” రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ ఎందుకంటే…
ఇప్పటికే “కల్కి” మూవీకి సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తి చేసేసారు మేకర్స్. అయితే లాస్ట్ విడత సీజీ వర్క్ ఫ్రేమ్స్ మాత్రం ఇంకా రావాల్సి ఉందట. అవి అనుకున్న సమయానికి వచ్చి, క్వాలిటీ అప్ టు ది మార్క్ ఉంటే మే 9న ఈ మూవీని రిలీజ్ చేయడం పక్కా అని తెలుస్తోంది. కానీ ఒకవేళ ఆ క్వాలిటీ మ్యాచ్ కాకపోతే, సీజీ వర్క్ మళ్లీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం “కల్కి” మేకర్స్ కి ఉన్న సమస్య ఇది ఒక్కటే. వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సహా చిత్ర బృందం మొత్తం అనుకున్న విధంగానే సీజీ వర్క్ క్వాలిటీ ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఖచ్చితంగా అనుకున్న సమయానికి మూవీని రిలీజ్ చేస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మొత్తానికి “కల్కి” మూవీ రిలీజ్ డేట్ ను సీజీ వర్క్ డిసైడ్ చేయబోతుంది అన్నమాట.

- Advertisement -

“కల్కి”లో దీపికా పాత్ర ఇదే…
ఇక “కల్కి” మూవీలో ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకొనే పద్మ అనే పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఈ మూవీలో లక్ష్మీదేవి స్వయంగా పద్మగా మరో అవతారం ఎత్తుతుందని తెలుస్తోంది. ఇక కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి మహావిష్ణు చివరి అవతారం కల్కిగా ప్రభాస్ నటిస్తుంటే, లక్ష్మీదేవి “కల్కి” సతీమణి పద్మగా ఆయన చెంతనే ఉంటుందన్నమాట. మొత్తానికి గాడ్ వర్సెస్ ఈవిల్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ను నాగ్ అశ్విన్ తెరపై చూపించబోతున్నాడు.

“కల్కి” లేటెస్ట్ అప్డేట్…
“కల్కి” చిత్ర బృందం ఓ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ ప్రభాస్ దిశా పటానిల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే తెర వెనక తీసిన ఈ సాంగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు