Devara : “దేవర” నెక్స్ట్ అప్డేట్ కోసం అప్పటిదాకా ఆగాల్సిందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”. ఈ మూవీ నుంచి మహాశివరాత్రి కానుకగా నెక్స్ట్ ఏదైనా సాలిడ్ అప్డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ ఆశలు నెరవేరడం కష్టమే. ఇంతకీ “దేవర” మూవీ నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు రాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

“దేవర”లో తంగం లుక్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “దేవర” రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ మూవీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేయక తప్పలేదు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామంటూ మరో కొత్త రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.

ఈ బాలీవుడ్ బ్యూటీ “దేవర” మూవీలో కంప్లీట్ గా యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు తంగం. జాన్వి మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక మార్చ్ 6న ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా “దేవర” నుంచి జాన్వి అట్రాక్టివ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు నెక్స్ట్ అప్డేట్ మహాశివరాత్రికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పట్లో “దేవర” నుంచి అప్డేట్లు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

- Advertisement -

జాన్వీ కాపూర్ గ్లింప్స్ ఇలా మిస్ అయింది… 
నిజానికి జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా “దేవర” టీం మూవీ సెట్స్ లో ఆమె ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల కేవలం ఆమె పోస్టర్ తో సరిపెట్టారు. ఇక మూవీ రిలీజ్ డేట్ కు ఇంకా చాలా రోజుల టైం ఉండడంతో ప్రమోషన్ల విషయంలో మేకర్స్ స్పీడ్ తగ్గించాలని నిర్ణయించుకున్నారట. కాబట్టి ఇప్పట్లో ఈ మూవీ నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం “దేవర” నెక్స్ట్ అప్డేట్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటిదాకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎదురు చూపులు తప్పవు.

“దేవర” స్టోరీ లైన్ ఇదే…
ఈ మూవీలో ఎన్టీఆర్ తీర ప్రాంతాల ప్రజలకు అండగా నిలబడే నాయకుడిగా కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలైంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న “దేవర” మూవీకి సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక “జనతా గ్యారేజ్” వంటి కమర్షియల్ హిట్ కొట్టిన కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్లో దాదాపు 8 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో “దేవర”పై అంచనాలు భారీగా ఉన్నాయి.

“పుష్ప 2” రిలీజ్ డేట్ పై “దేవర” కన్ను
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ “పుష్ప 2” ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది. ఒకవేళ ఈ మూవీ డెడ్ లైన్ మీట్ అవ్వడంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అదే డేట్ పై “దేవర” కూడా కన్నేశాడు. ప్రొడక్షన్ టీం ఇప్పటికే “పుష్ప 2” పోస్ట్ పోన్ అయితే అదే డేట్ కు “దేవర” రాబోతుందని హింట్ ఇచ్చేశారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు