Lifestyle : అమ్మాయిలు చాలా లేట్ గా నేర్చుకునే లైఫ్ లెసన్స్ ఇవే

జీవితంలో ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్న తర్వాత అదొక లైఫ్ లెసన్ అని అనుకుంటూ ఉంటాము. నిజానికి లైఫ్ అనేదే లెసన్స్ తో నిండిపోయి ఉంటుంది. ప్రయత్నించడం, ఫెయిల్ అవ్వడం, మళ్లీ ట్రై చేయడం, నేర్చుకోవడం, ముందుకు సాగడం… ఇవన్నీ లైఫ్ లైసెన్స్ లో భాగమే. అయితే ఎంత నేర్చుకున్నా కూడా కొన్ని విషయాలు నేర్చుకునేసరికి చాలా ఆలస్యం అవుతుంది. మరి అమ్మాయిలు జీవితంలో చాలా లేట్ గా నేర్చుకునే లైఫ్ లెసన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీరే బాధ్యులు
ఇతరులు మీతో ఎలా ప్రవర్తిస్తారు అన్నదానికి పూర్తి బాధ్యత మీదే. ఈ విషయాన్ని చాలామంది అమ్మాయిలు తెలుసుకునేసరికి ఆలస్యం అయిపోతుంది. మీరు అవతలి వ్యక్తిని ఎంత ఓపికగా భరిస్తున్నారో దాన్ని బట్టే మీతో వాళ్ల ప్రవర్తన ఉంటుంది. అంటే మీరే స్వయంగా వాళ్ళు మీతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని చెప్తున్నట్టు. కాబట్టి పర్సనల్ బౌండరీస్ సెట్ చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది.

2. యాటిట్యూడ్
మీ యాటిట్యూడ్ లైఫ్ ఎలా ఉండాలి? అనేది నిర్ణయిస్తుంది. పాజిటివ్ మెంటాలిటీ, సెల్ఫ్ టాక్ వంటివి మిమ్మల్ని మరింత కాన్ఫిడెంట్ గా కనిపించేలా, లైఫ్ లో సక్సెస్ అయ్యేలా చేస్తాయి. అలాగే అవకాశాలను, సరైన వ్యక్తులను మీకు దగ్గర చేస్తాయి. కానీ చాలామంది మహిళలు యాటిట్యూడ్ పవర్ ని ఆలస్యంగా తెలుసుకుంటారు.

- Advertisement -

3. వాళ్లను వాళ్ళలా ఉండనివ్వండి
ప్రేమ అనేది గమ్మత్తైనది. మీపై ఇష్టం ఉంటే ఏదో ఒక సమయంలో వాళ్లే దగ్గరవుతారు. తమపై ఇష్టం లేని వ్యక్తి కోసం వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని చాలా లేట్ గా తెలుసుకుంటారు అమ్మాయిలు. ఎవరైనా మీకు నచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడకపోతే వాళ్లను దూరం పెట్టేయండి.

4. వాళ్లు అనవసరం
చాలామంది అమ్మాయిలు తమ విలువను గుర్తించలేని, తమతో సరిగ్గా వ్యవహరించని వ్యక్తుల కోసం ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. కానీ మీతో చెడుగా ప్రవర్తించేవాళ్లకు ఆ అర్హత లేదు. మీ కన్నీళ్లు విలువైనవి అని గుర్తుపెట్టుకోండి. చాలామంది మహిళలు ఇలాంటి విషయాల్లో తట్టుకోలేనంత బాధ, నిరాశను ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

6. ఆరోగ్యం
చాలామంది మహిళలు ఆలస్యంగా నేర్చుకునే మరో లైఫ్ లెస్సన్ ఏమిటంటే ఆరోగ్యంపై కాన్సెంట్రేట్ చేయడం. యంగ్ గా ఉన్నప్పుడు వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి ఆలోచించరు. వృద్ధాప్యంలో కూడా ఫిట్నెస్ తో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పటినుంచి వ్యాయామం లాంటి కొన్ని ఫిట్నెస్ అలవాట్లను అలవర్చుకోవాలి అనే విషయం తెలుసుకునే సరికి జీవితకాలం గడిచిపోతుంది.

6. నిర్ణయాలు తీసుకోకపోయినా కష్టమే
చాలామంది కంఫర్ట్ జోన్లో హ్యాపీగా బ్రతికేయడానికి ఇష్టపడతారు. కానీ లైఫ్ లో చాలెంజెస్ అనేవి ఎదురైనప్పుడే మరింత బలంగా మారుతారు. కంఫర్ట్ జోన్ లో జీవితాన్ని గడిపేయాలని నిర్ణయం తీసుకున్నారంటే అది మీరు ఫ్యూచర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం లేదా తీసుకోని నిర్ణయానికి కూడా పరిణామాలు కచ్చితంగా ఉంటాయి అనే విషయాన్ని అమ్మాయిలు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు.

7. నమ్మకం
మీతో అవతలి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నదే ముఖ్యం. వాళ్ళ చేసే పనుల ఉద్దేశాలను అంచనా వేయడం అనేది మంచిదే. అవతలి వ్యక్తి ఏది చెప్పినా గుడ్డిగాని నమ్మడం కరెక్ట్ కాదు. అలా నమ్మడం వల్ల నమ్మకద్రోహానికి గురై బాధపడాల్సి వస్తుంది. అయితే చాలామంది మహిళలకు ఈ అవగాహన జీవితంలో చాలా ఆలస్యంగా వస్తుంది. సంవత్సరాల తరబడి అనర్హమైన వ్యక్తులను నమ్ముతూ గడిపిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది.

8. అభిప్రాయం
మీ గురించి ప్రజలకు ఉండే అభిప్రాయంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. అసలు అవతలి వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోవలసిన అవసరం లేదు. చాలామంది మహిళలు తమ జీవితంలో ఎక్కువ భాగం ఇతరులు ఏమనుకుంటున్నారు లేదా వాళ్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఈ పాఠాన్ని నేర్చుకుంటారు. తమ గురించి తమ అభిప్రాయం మాత్రమే ముఖ్యమని గ్రహించడానికి చాలా సమయం పడుతుంది.

9. ఫ్యామిలీ ముఖ్యం
జీవితం చాలా చిన్నది. కాబట్టి సొంత కుటుంబం ఉండాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎక్కువ సమయం వేస్ట్ చేయకండి. మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మహిళలకు ఎక్కువ సమయం ఉండదు అన్నది వాస్తవం. కాబట్టి కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకునేవారు అతి తక్కువ మంది మాత్రమే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు