Gama Awards Winners List : “గామా” అవార్డ్స్ లో కూడా “పుష్ప”దే హవా 

ప్రతి ఏడాది దుబాయ్‌లో ఏఎఫ్ఎమ్ ప్రాపర్టీస్ ప్రజెంట్ చేసే గామా అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయన్న విషయం సినీ ప్రియులకు తెలిసిందే. అయితే ఈ ఏడాది గామా` తెలుగు మూవీ అవార్డ్స్ ఫోర్త్ ఎడిషన్ చాలా గ్రాండ్ గా జరిగింది. మార్చ్ 3న దుబాయ్ లోని జబీన్ పార్క్ లో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాలు పంచుకోగా, 2021, 22, 23 సంవత్సరాలలో రిలీజ్ అయిన సినిమాలకు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ వంటి 42 కేటగిరీలలో అవార్డ్స్ ఇచ్చి గౌరవించారు.

టాలీవుడ్ నుంచి సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ, తేజ సజ్జ, నిఖిల్ సిద్ధార్థ, మంచు మనోజ్ వంటి యంగ్ హీరోలతో పాటు ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్, నేహ శెట్టి వంటి హీరోయిన్లు కూడా హాజరై తమ అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ అవార్డ్స్ వేడుకలో కూడా ఎప్పటిలాగే “పుష్ప” హవానే నడిచింది. ఏకంగా మూడు అవార్డులను “పుష్ప” టీం అందుకోవడం విశేషం. ఇక గామా అవార్డ్స్ విన్నర్స్ కంప్లీట్ లిస్టు విషయానికి వస్తే…

గామా అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్
ఉత్తమ నటుడు 2021 – అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటుడు 2022 – నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)
ఉత్తమ నటుడు 2023 – ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి 2021 – ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)
ఉత్తమ నటి 2022 – మృణాల్ ఠాకూర్ (సీతా రామం) –
ఉత్తమ నటి 2023 – సంయుక్తా మీనన్ (విరూపాక్ష)
ఉత్తమ ప్రామిసింగ్ నటి 2021 – ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగా)
ఉత్తమ ప్రామిసింగ్ నటి 2022 – దక్షా నాగార్కర్ (జోంబీ రెడ్డి)
ఉత్తమ ప్రామిసింగ్ నటి 2023 – డింపుల్ హయాతి (ఖిలాడీ)
బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ – తేజ సజ్జా (హనుమాన్)
మూవీ ఆఫ్ ది ఇయర్ 2021 – పుష్ప (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి, నవీన్ యెర్నేని)
మూవీ ఆఫ్ ది ఇయర్ 2022 – సీతా రామం (వైజయంతీ మూవీస్.. స్వప్న, ప్రియాంక దత్)
మూవీ ఆఫ్ ది ఇయర్ 2023 – బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, TG విశ్వప్రసాద్)
ఉత్తమ దర్శకుడు 2021 – సుకుమార్ (పుష్ప)
ఉత్తమ దర్శకుడు 2022 – హను రాఘవపూడి (సీతా రామం)
ఉత్తమ దర్శకుడు 2023 – బాబీ కొల్లి (వాల్తేరు వీరయ్య)
జ్యూరీ ఉత్తమ నటుడు 2022 – విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కల్యాణం)
జ్యూరీ ఉత్తమ నటుడు 2023 – సందీప్ కిషన్ (మైఖేల్)
గామా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ – డా. కోటి సాలూరి (40 సంవత్సరాల సంగీత ప్రయాణం)
స్పెషల్ జ్యూరీ అవార్డు – MM శ్రీలేఖ (25 సంవత్సరాల సంగీత ప్రయాణం)
గామా గౌరవ్ సత్కర్ – చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్ )
ఉత్తమ సంగీత దర్శకుడు 2021 – దేవి శ్రీప్రసాద్ (పుష్ప)
ఉత్తమ సంగీత దర్శకుడు 2022 – థమన్ (భీమ్లా నాయక్)
ఉత్తమ సంగీత దర్శకుడు 2023 – హేషమ్ అబ్దుల్ వహాబ్ (ఖుషి)
ఉత్తమ ఆల్బమ్ 2022 – సీతా రామం (విశాల్ చంద్రశేఖర్)
ఉత్తమ గీత రచయిత – కాసర్ల శ్యామ్ (చంకిల అంగీ లేసీ “దసరా”)
ఉత్తమ వర్సటైల్ యాక్టర్ – మురళీ శర్మ
గామా జ్యూరీ సభ్యుడు – VN ఆదిత్య ( గామా జ్యూరీ)
మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 – నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)
మోస్ట్ పాపులర్ సాంగ్ 2023 – పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)
గామా మూవీ అఫ్ ది డెకేడ్ – ఆర్ఆర్ఆర్
మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ – నెక్లెస్ గొలుసు (రఘు కుంచె)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2021 – ధనుంజయ్ (నా మది నీడదై)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2021 – ML శ్రుతి (అడిగా అడిగా)
ఉత్తమ నేపథ్య గాయని 2022 – హరికా నారాయణ (ఆచార్య నుండి లాహె లాహె)
ఉత్తమ నేపథ్య గాయని ఫీమేల్ 2023 – చిన్మయి (ఆరాధ్య – ఖుషి)
ఉత్తమ పాపులర్ సాంగ్ 2021 – మౌనిక యాదవ్ (సామీ సామీ – పుష్ప)
గద్దర్ స్మారక పురస్కారం : జానపద గాయకుడు నల్గొండ గద్దర్ నరసన్న
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్ 2022 – అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల- శ్యామ్ సింగ రాయ్)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్ 2023 – రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ ధామ్ – దసరా)

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు