Hesham Abdul Wahab: మళ్లీ నిరూపించుకున్నాడు… ఇక తెలుగు ఇండస్ట్రీనే ఏలడమే లేటు

ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది షిప్ అంటారు. ఒక సినిమా హిట్ అయినా, ఫట్ అయినా ఆయనదే బాధ్యత. అలాగే సినిమాకు కావాల్సిన కాస్ట్ అండ్ క్రూని ఎంచుకోవడం చాలా కీలకం. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా, సినిమాకే మైనస్ అవుతుంది. అందులోనూ సినిమాను నిలబెట్టే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు సినిమాకు న్యాయం జరగాలి… అటు నిర్మాతలకు ఇబ్బంది కాకుండదు. అలా ప్లాన్ చేసుకోవాలి. ఈ విషయంలో నాని నటించిన హాయ్ నాన్న సినిమా డైరెక్టర్ శౌర్యువ్ సక్సెస్ అయ్యాడు.

ముఖ్యంగా చెప్పాలంటే… మ్యూజిక్ డైరెక్టర్‌గా హేషమ్ అబ్డుల్ వహాబ్‌ను ఎంపిక చేసుకోవడం సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సన్నివేశాలు గానీ, నాని – మృణాల్ మధ్య వచ్చే రొమాంటికల్ సీన్స్ లో గానీ, హేషమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ అనుకోవచ్చు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు హేషమ్ ఇచ్చే మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో వచ్చిన ‘హృదయం’ సినిమా టైంలోనే హేషమ్ తనను తాను ప్రూఫ్ చేసుకున్నాడు.

ఇక తెలుగులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా వచ్చిన ‘ఖుషి’ సినిమా ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్లే నిలబడింది అని ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు హాయ్ నాన్నకి కూడా అలాంటిదే జరిగింది. ప్రస్తుతానికి వచ్చిన హాయ్ నాన్న మూవీ రివ్యూ ప్రకారం.. సినిమా నేరేషన్ స్లోగా ఉందని, సెకండాఫ్ చాలా బోరింగ్ గా ఉందని క్రిటిక్స్ చెబుతున్నారు. కానీ, ఎంతో కొంత పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయంటే… అది కేవలం హేషమ్ అబ్డుల్ వహాబ్‌ ఇచ్చిన మ్యూజిక్ వల్ల అనే చెప్పొచ్చు.

- Advertisement -

ఒక సినిమాను మ్యూజిక్ భుజాలపై మొస్తుంది అని అంటారు కదా… ఇప్పుడు హాయ్ నాన్న సినిమాను హేషమ్ అందించిన మ్యూజికే మోస్తుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేషమ్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న కొద్ది మంది మ్యూజిక్ డైరెక్టర్లు… భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ అవుట్ పుట్ మాత్రం అంచనాలను అందుకోవడం లేదు. ఇలాంటి టైంలో హేషమ్ క్లిక్ కావడంతో… దర్శక నిర్మాతలకు ఆయన మొదటి ఆప్షన్ కావొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు