Sailesh kolanu: ప్రమోషన్లలో ‘సైంధవ్‌’ జోరు!

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘సైంధవ్‌’ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతుందన్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మించడం జరిగింది. ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నిజానికి డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు, కానీ అదే రోజు ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అవుతుండడంతో మేకర్స్ సంక్రాంతి కి షిఫ్ట్ చేసారు.

అయితే సినిమా ఇప్పటికే దాదాపుగా మొత్తం పూర్తయిందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. తాజాగా నవాజుద్దీన్ సిద్ధికి తన వాయిస్ తో సినిమాకి డబ్బింగ్ చెప్పగా, చాలా మంది నటులు తమ సొంత వాయిస్ నే ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్.

ఇక లేటెస్ట్ గా వెంకటేష్ కూడా నాని తో హాయ్ నాన్న కోసం ఇంటర్వ్యూ చేయగా, ఆ ఇంటర్వ్యూ లోనే తన సైంధవ్‌ సినిమా చిత్ర విశేషాలను కూడా పంచుకున్నాడు. ఇక సైంధవ్‌ సినిమా పూర్తవగానే శైలేష్ కొలను కూడా హిట్ 3 సినిమా నానితో స్టార్ట్ చేయనున్నాడు, అందుకే ఇద్దర్ని కలిపి హాయ్ నాన్న ఇంటర్వ్యూ చేసారు. ఇక సైంధవ్‌ నుండి వచ్చే వారం మరో సాంగ్ ని రిలీజ్ చేస్తుండగా, ఇప్పట్నుంచే మూవీ యూనిట్ మొత్తం కలిసి ఏదో ఒక విధంగా సోషల్ మీడియా లో సైంధవ్‌ మాట జనాల నోటా వచ్చేలా చూస్తున్నారు. మరి సైంధవ్‌ సంక్రాంతి పోరు లో ఏమాత్రం జోరు చూపిస్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు