Hi Nanna Movie: ఈమాత్రం దానికి అంత హడావిడా? శృతి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే?

‘హాయ్ నాన్న’ మూవీ ఈరోజు ఉదయం నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, బేబీ కియారా కన్నా కీలకపాత్రలో నటించారు. ఈ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నటించింది. సినిమాలో ఈమె పాత్రను చూసిన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి సినిమాలో శృతిహాసన్ కూడా ఉందంటూ అంత హడావిడి దేనికి ? సినిమాలో శృతి హాసన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని పెదవి విరుస్తున్నారు. మరి సినిమాకు ప్లస్ అవుతుందని అనుకున్న శృతి ఇలా మైనస్ గా మారడానికి కారణం ఏంటి అంటే…

“హాయ్ నాన్న” మూవీకి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న శృతిహాసన్ మరో ఎస్సెట్ అవుతుందని అందరూ భావించారు. ‘ఓడియమ్మ’ సాంగ్ తో పాటు మరికొన్ని సన్నివేశాల్లో ఈ బ్యూటీ కనిపించబోతోంది అనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ట్రైలర్ లోను కొన్ని సెకండ్ల పాటు మెరిసి సినిమాపై ఆసక్తిని పెంచేసింది శృతిహాసన్. ఇక ఈ బ్యూటీ కేవలం ఐదు నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ కోసం ఏకంగా కోటి రూపాయల దాకా రెమ్యూనరేషన్ అందుకుంది అని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో ఆమె రోల్ స్పెషల్ గా ఉంటుందని, అది కూడా సినిమాను కీలక మలుపు తిప్పేదై ఉంటుందని అంతా అంచనా వేశారు. కానీ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ శృతిహాసన్ సినిమాలో కేవలం నిమిషాల వ్యవధిలో మాత్రమే కనిపించడం గమనర్హం. అయితే ఇప్పుడు సినిమాను చూసిన ప్రేక్షకులు శృతిహాసన్ క్యారెక్టర్ పట్ల పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్పెషల్ సాంగ్ లో కూడా పూర్తిగా లేని క్యారెక్టర్ శృతిది.

- Advertisement -

‘హాయ్ నాన్న’ మూవీలో ఆమె ఉన్నా లేకపోయినా, ఆ స్పెషల్ సాంగ్ లో శృతిహాసన్ కనిపించకపోయినా ఎలాంటి నష్టం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ ‘సలార్’ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారబోతోంది. మరి ఇలాంటి టైంలో శృతి తన క్యారెక్టర్ కు అసలు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్ ను ‘హాయ్ నాన్న’ మూవీలో ఎందుకు చేయాలనుకుందో? అసలు ఆమె ఈ సినిమాలో కనిపించడానికి కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు శృతిహాసన్ ఫ్యాన్స్. స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఈ సమయంలో చేసే ఇలాంటి చిన్న చిన్న తప్పులే కెరీర్ పై ఎఫెక్ట్ పడేలా చేస్తాయని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు