Tollywood : ఆ హీరోయిన్ కెరీర్ కి ఆ దర్శకుడి హామీ మామూలుగా లేదే..!

టాలీవుడ్ లో అభినయం ప్రదర్శించే హీరోయిన్ల కన్నా.. అందాల ఆరబోత చేసే హీరోయిన్లకే మైలేజ్ ఎక్కువ. అయితే ఆ విషయం తెలియక కొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే పాపం తెరమరుగు అయిపోతుంటారు. అయితే బోల్డ్ సీన్స్ లో నటించడం.. దర్శకుడు అడిగినకాడికి విప్పి చూపించడం కొందరు హీరోయిన్ల కి షరా మామూలే అని చెప్పాలి. ఇండస్ట్రీలో దర్శకులకు, హీరోయిన్లకు మధ్య బంధాలు, అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకాశాల కోసం హీరోయిన్లు దర్శకులకు బాగా కోపరేట్ చేస్తూ ఉంటారు.

ఆ దర్శకులు చూపించమన్నదంత చూపిస్తున్నారని నానుడి ఇండస్ట్రీలో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ హీరోయిన్ కి సరైన అవకాశాలు లేవు. అయినప్పటికీ ఓ దర్శకుడు ఆమెను వాడాల్సిన విధంగా వాడుతూ హీరోయిన్ గా మంచి పొజిషన్ లో నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు ఆ ఇద్దరి బందంపై ఇండస్ట్రీలో పలురకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు దర్శకుడు అజయ్ భూపతి – హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో ఆమె మళ్ళీ మంగళవారం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో పాయల్ చేసిన నటన, ఆమెను దర్శకుడు చూపించిన తీరు చాలా కొత్తగా అనిపించింది. అయితే ఇండస్ట్రీలో ఇక పాయల్ పని అయిపోయిందనుకున్న సమయంలో ఆమె కెరీర్ కి మళ్ళీ మంచి ఊపు వచ్చింది. అయితే తాజాగా పాయల్ తన పుట్టినరోజును జరుపుకున్న నేపథ్యంలో ఆమెకు అజయ్ తో పాటు మంగళవారం టీం స్పెషల్ గా బర్త్డే విషెస్ తెలిపింది. ముఖ్యంగా అజయ్ భూపతి “హ్యాపీ బర్త్డే టూ ఇందు అండ్ శైలు” అంటూ ప్రత్యేకమైన ప్రేమను చాటుకున్నారు. ఏది ఏమైనా ముందు ముందు అజయ్ భూపతి.. పాయల్ తో ఇంకా చూపించాల్సినవన్నీ చూపిస్తూ ఆమె కెరీర్ ని జాగ్రత్తగా కాపాడుతారని అంటున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు