Venkatesh New Movie: రోజురోజుకి అంచనాలు పెంచేస్తున్న “సైంధవ్”

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా “సైంధవ్“. ఆయన నటిస్తున్న 75వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాని శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా ఇంతకు ముందు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాను చాలా కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని తెలుస్తుంది. వెంకటేష్ చాలా రోజుల తరువాత తన స్థాయికి తగ్గ సినిమా చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

అందువల్ల ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ సెలక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముందుగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని టీమ్ అనౌన్స్ చేయగా, ఆ తరువాత వరుస బెట్టి ఆర్టిస్ట్ లను, వారి పాత్రలను రివీల్ చేసారు. తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన సైంధవ్ విషెష్ వీడియో కూడా ఓ రేంజ్ లో ఉంది.

- Advertisement -

ఆ వీడియో లో వెంకటేష్ మొదలుకొని, నవాజుద్దీన్ సిద్ధికి, ఆండ్రియా, శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, బేబీ సారా లుక్స్ ని రివీల్ చేసాడు. ఇక ఈ సినిమాకి ప్రమోషన్లు కూడా చాలా ఆసక్తికరంగా చేస్తున్నారు. సైంధవ్ సినిమా కి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే 80శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా అక్టోబర్ కల్లా సినిమా షూట్ మొత్తం పూర్తి అవుతుందని మేకర్స్ చెప్పడం జరిగింది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాను డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు