Venkatesh: యమ స్పీడుగా “సైంధవ్” చిత్రీకరణ

Venkatesh “Saindhav” shooting update

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ మీదున్నాడు. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తుండగా, యాక్షన్ థ్రిలర్ జోనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వెంకటేష్ కెరీర్ బెస్ట్ మాస్ లుక్స్ తో కనిపిస్తున్న ఈ సినిమాతో వెంకటేష్ భారీ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ తాజాగా ఆక్షన్ సన్నివేశాల సీన్స్ తీయడం జరిగింది.

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆ సీన్స్ షూట్ చేయగా, 16 రోజుల నాన్ స్టాప్ షెడ్యూల్ లో క్లైమాక్స్ చిత్రీకరణ జరిగింది. ఇంతకు ముందు వైజాగ్ లో చిత్ర షూటింగ్ జరుపుకోగా, తాజాగా హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. వైజాగ్ షెడ్యూల్ లో హీరో వెంకటేష్ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధికి, ఆండ్రియా తదితరులు షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది.

ఇక సైంధవ్ సినిమా కి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికి ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా తెలుగులో ఆయనకిదే మొదటి సినిమా. ఇక తాజాగా పూర్తైన షెడ్యూల్ తో 80శాతం షూటింగ్ పూర్తి కాగా, షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇక సైంధవ్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు