Venky75: శైలేష్ కొలను మూవీ లో ఈ హీరోయిన్ కూడా..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సైంధవ్”. హిట్, హిట్ 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. “నిహారిక ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాలా, కబాలి వంటి చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయణన్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన దసరా మూవీకి సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్ ఎంతో ప్లస్ అయింది.

ఈ మధ్యనే హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కూడా అయిపొయింది. ఇక రెండో షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ సినిమా లో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఆయనకిదే మొదటి సినిమా.

ఇదిలా ఉండగా తాజాగా సైంధవ్ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ లో టాలెంటెడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా జాయిన్ అవుతుందంటూ ఈ రోజు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక ఈ సినిమా లో శ్రద్దా శ్రీనాథ్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తన రోల్ పేరు మనోజ్ఞ అని చెప్పడం జరిగింది.

- Advertisement -

వెంకటేష్ 75 వ సినిమాగా వస్తున్న సైంధవ్ ని పాన్ ఇండియా సినిమా గా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక సైంధవ్ మూవీ ని వరల్డ్ వైడ్ గా క్రిస్మస్ కానుక గా డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు