Telugu Actrees: సౌందర్య తల లేదు.. మొండెం మాత్రమే ఉంది..!

కన్నడ స్టార్ హీరోయిన్ ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప చిత్రాలు నటించి మెప్పించారు. కానీ 2010 నుంచి వెండితెరకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 2017, 2022లో మాత్రం రెండు చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, సినిమా కెరీర్ గురించి ప్రేమ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తెలుగు ప్రేక్షకులపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోతే టాలీవుడ్ లో అంత గొప్ప నటిని కాలేకపోయాను అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలో దివంగత నటి సౌందర్య మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. సౌందర్య చనిపోయిన రోజు ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. చివరి చూపు కోసం వాళ్ళ ఇంటికి వెళ్లాను. సౌందర్య, ఆమె సోదరుడు డెడ్ బాడీలను బాక్స్ లో పెట్టి ఉంచారు. చూడడానికి ఫేస్ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది.

మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, గౌరవం మాత్రమే. సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని బట్టి అది సౌందర్య డెడ్ బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారు. షూటింగ్ లో షాట్ గ్యాప్ లో కూడా ఎప్పటికప్పుడు టచ్ అప్ చేసుకుంటూ, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది అంటూ ప్రేమ పేర్కొంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు