Bhola shankar: చిరు ఈ ముగ్గుర్ని కాదని వినాయక్ కి ఓటేస్తాడా?

Will Chiru vote for Vinayak and not these three?

టాలీవుడ్ ఇండస్ట్రీ ని మూడు దశాబ్దాల పాటు శాసించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య తో సూపర్ ఫామ్ లోకి వచ్చిన చిరు, భోళా శంకర్ తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. నిజానికి భోళా శంకర్ పై మెగాఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపలేదు. ఆ సినిమా రీమేక్ కావడం, మెహర్ రమేష్ డైరెక్టర్ కావడం వల్ల దారుణమైన పరాజయాన్ని అందుకుంది. వీటన్నిటినీ మించి చిరు పవన్ ని ఇమిటేట్ చేయడం, ఖుషి నడుము సీన్ ప్రేక్షకులకి ఇరిటేట్ తెప్పించింది.

అయితే ఈ దెబ్బ నుండి మెగాస్టార్ గుణపాఠం నేర్చుకున్నట్టే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇకపై రీమేక్ సినిమాలు బాస్ చేయడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవితో తీసేందుకు ముగ్గురు డైరెక్టర్లు కథలతో లైన్లో ఉన్నారని తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ, వశిష్ట, అనిల్ రావిపూడి. ఈ ముగ్గురిలో ఒకర్ని చిరంజీవి ఓకే చేసే అవకాశం ఉందని అనుకున్నారు అందరు. అయితే వీరందరిని కాదని చిరంజీవి తనకిష్టమైన అభిమానితో సినిమాని తీసే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తుంది.

ఆ డైరెక్టర్ ఎవరో కాదు వివి వినాయక్. చిరంజీవికి ఠాగూర్ లాంటి మంచి మెసేజ్ తో కూడిన బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వడమే గాక, రీ ఎంట్రీ ఖైదీ నెం 150 కూడా చేసి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ రెండు రీమేక్ లే గమనార్హం. అయితే తాజాగా వివి వినాయక్ ఠాగూర్ లాంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథని చిరుకి వినిపించాడని, ఆ కథ కూడా చిరుకి నచ్చిందని చిరంజీవి బర్త్ డే రోజు అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అంతే కాదు ఆ స్టోరీ స్ట్రెయిట్ కథ అని నెటిజన్లు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలీదు గాని ఆల్రెడీ ప్లాపుల్లో ఉన్న మెహర్ కి ఇచ్చి తప్పు చేసాడని కొందరు మెగాభిమానులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు