Bhola shankar: చిరు నెక్స్ట్ సినిమా వినాయక్ తోనా?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకువెళ్ళుతున్నాడు. గత ఏడాది రెండు ప్లాప్ సినిమాలతో దెబ్బతిన్న మెగా స్టార్ ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తో దాన్ని కవర్ చేసేసాడు. ఇక ఇప్పుడు భోళా శంకర్ తో ప్రేక్షకుల ఉండును రావడానికి సిద్ధం అవుతున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 11న విడుదలకి సిద్ధం అవుతుంది. అయితే భోళా శంకర్ సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేయలేదు మెగాస్టార్.

అయితే పలు దర్శకుల స్క్రిప్టులు మాత్రం వింటున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అలాగే యువ దర్శకుడు వశిష్ట కథలు విన్న మెగాస్టార్ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేయమని సూచించాడని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని వివి వినాయక్ తో చేయాలనీ భావిస్తున్నట్టు చిత్ర వర్గాల్లో టాక్ నడుస్తుంది. దానికితోడు రీసెంట్ గా రిలీజ్ అయిన భోళా శంకర్ సాంగ్ వీడియోలో సెట్స్ లో వివి వినాయక్ కనిపించడం ఈ రూమర్ ని బలంగా నమ్మేలా చేస్తుంది.

ఇక వివి వినాయక్ చిరంజీవి అభిమాని ని తెలిసిందే. ఇంతకు ముందు వీరి కాంబో లో వచ్చిన ఠాగూర్, ఖైదీ నెంబర్150 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరి కాంబో లో హ్యాట్రిక్ సినిమా వస్తుందని నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ సారైనా రీమేక్ కాకుండా కొత్త కథతో స్ట్రెయిట్ సినిమా తీస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలు నిజమైతే వివి వినాయక్ కి భారీ కమ్ బ్యాక్ ఛాన్స్ వచ్చినట్టే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు