Nelson : ప్రొడ్యూసర్ గా మొదటి సినిమా అప్పుడే అనౌన్స్ చేస్తా

Nelson: కోలమావు కోకిల అనే సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు నెల్సన్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని డార్క్ కామిడీ అంటే ఏంటో ప్రేక్షకులకు చూపించాడు. ఆ సినిమాతోనే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత నెల్సన్ చేసిన సినిమా వరుణ్ డాక్టర్. ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్టుగా నిలిచింది. అయితే ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బీస్ట్ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ ను చూసింది. ఇకపోతే ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్ తో రీసెంట్గా జైలర్ అనే సినిమాను చేశాడు నెల్సన్. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బీభత్సమైన వసూళ్లను కలెక్ట్ చేసింది. రజినీకాంత్ కి మంచి కం బ్యాక్ అయింది. కేవలం రజనీకాంత్ కి మాత్రమే కాకుండా నెల్సన్ కి కూడా మంచి కంబ్యాక్ అనిపించింది. మళ్ళీ నెల్సన్ రజినీకాంత్ తో జైలర్ 2 అనే సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో నెల్సన్ ఒక ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అనేది నెల్సన్ కి ఎప్పటినుంచో ఉన్న కల. నయనతార తో సినిమా కంటే ముందు శింబు తో ఒక సినిమా మొదలై ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లు పాటు ఖాళీగా ఉన్నాడు నెల్సన్ దిలీప్. తర్వాత మళ్లీ సినిమాను చేసి మంచి సూపర్ హిట్ అందుకుని నేడు స్టార్ డైరెక్టర్ లలో ఒకడుగా ఎదుగుతున్నాడు. అయితే నెల్సన్ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ సందర్భంగా తాను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. తన ప్రొడక్షన్ హౌస్ లో రాబోయే సినిమా గురించి ఒక లెటర్ ని రిలీజ్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ ప్రొడక్షన్స్ లో రాబోయే సినిమాను రేపు అనౌన్స్ చేయనున్నట్లు తెలిపాడు.

- Advertisement -

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో నా ప్రయాణం నాకు 20 ఏళ్ల వయసులో మొదలైంది. ఇన్ని సంవత్సరాలుగా, ఈ పరిశ్రమలో నా ఎదుగుదలకు హెచ్చు తగ్గులు ఉన్నాయి. వీటన్నింటి మధ్య, నిర్మాణ సంస్థను సొంతం చేసుకోవడం ఎప్పటినుండో నా కోరిక, మరియు ఈ రోజు నా స్వంత నిర్మాణ సంస్థ ‘ఫిలమెంట్ పిక్చర్స్’ని ప్రారంభించడం గురించి నేను సంతోషిస్తున్నాను! ఫిలమెంట్ పిక్చర్స్‌లో, విస్తృత ప్రేక్షకులను అలరించే సృజనాత్మక మరియు ఆసక్తికరమైన కంటెంట్‌ను రూపొందించడం మా మొదటి లక్ష్యం. మే 3న మా మొదటి ప్రాజెక్ట్ వెయిట్ చెయ్యండి. మీ సపోర్ట్ కి థాంక్యూ.టెలివిజన్ ఛానల్లో తన కెరీర్ ను మొదలుపెట్టి, రజనీకాంత్ లాంటి హీరోతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టి. నేడు ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే స్థాయికి రావటం అనేది మామూలు విషయం కాదు. ఇది నెల్సన్ కష్టానికి ఫలితం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు