Natasa Stankovic : టీవీ నటుడితో ఎఫైర్ నడిపిన టీమ్ ఇండియా క్రికెటర్ భార్య..!

Natasa Stankovic : సినీ సెలబ్రిటీలలో కొంతమంది కి వైవాహిక బంధం టైం పాస్ లాగా మారిపోయింది.. మొదట తమకు నచ్చిన వారితో డేటింగ్ చేయడం.. ఆ తర్వాత వారితో విభేదాలు వస్తే వారిని వదిలేసి ఇంకొకరిని వివాహం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఆ తర్వాత కూడా అలా వివాహం చేసుకున్న వారితో ఎక్కువ కాలం ఉండలేక వారితో కూడా విడాకులు తీసుకుంటున్న వారిని చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక నటి మాత్రం ఒకప్పుడు టీం ఇండియా క్రికెటర్ తో ఎఫైర్ నడిపి.. పెళ్లి కాక ముందే తల్లి అయ్యి.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ క్రికెటర్ ను వివాహం చేసుకుంది ..అయితే అతని కంటే ముందే మరొక టీవీ నటుడితో ఎఫైర్ నడిపి వార్తల్లో నిలిచింది..

నటాషా స్టాంకోవిక్..

బాలీవుడ్ నటిగా కెరియర్ మొదలుపెట్టిన ఈమె స్టార్ క్రికెటర్ తో పెళ్లికి ముందే తల్లి అయింది.. ఈమె ఎవరో కాదు నటాషా స్టాంకోవిక్. సెర్బియా కు చెందిన ఈమె.. సినిమాలలో నటించడం మొదలు రియాల్టీ షోలలో డాన్స్ చేయడం వరకు అన్నింటిలో కూడా పాల్గొంటుంది. 2013లో వచ్చిన సత్యాగ్రాగం అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె ఈ సినిమాలో అజయ్ దేవగన్, కరీనా కపూర్, అమితాబ్ బచ్చన్, అర్జున్ రాంపాల్, మనోజ్ బాజ్ పాయ్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అంతే కాదు స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి మెప్పించిన ఈమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితం లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

హార్దిక్ పాండ్యాతో రిలేషన్..

కరోనా సమయంలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న జంటలలో హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ జంట కూడా ఒకటి. హార్దిక్ పాండ్యా కంటే వయసులో ఈమె ఏడాదిన్నర పెద్దది.. ఇతడితో వివాహానికి ముందే గర్భవతి అయింది.. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. నటాషా సెర్బియాలో 1992 మార్చి 4న జన్మించింది.. హార్దిక్ పాండ్యా కంటే ముందుగా అలీ గోని అనే టీవీ నటుడితో చాలా కాలం పాటు ప్రేమయణం కొనసాగిన ఈమే ఇతడితో కలసి నాచ్ బలియే అనే రియాల్టీ షో లో కూడా పాల్గొనింది.

- Advertisement -

టీవీ నటుడితో బ్రేకప్..

అయితే కొద్ది రోజులకు అలీ గోని – నటాషా మధ్య తేడాలు రావడంతో బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.. ఆ సమయంలో ఇద్దరు భిన్నమైన సంస్కృతులకు చెందినవారు కావడంతోనే వీరిద్దరూ విడిపోయామని వెల్లడించారు. ఆ తరువాత ఈమె క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. డేటింగ్ టైంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా – నటాషా స్టాంకోవిక్ జంటకు అగస్త్య పాండ్యా అనే కుమారుడు కూడా ఉన్నారు.. 2020లో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న వీరు గత ఏడాది హిందూ, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం మళ్లీ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు టీమిండియా క్రికెటర్ భార్యగా నటాషా కొనసాగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు