Salaar Release Date in Japan : జపాన్ లో డైనోసార్ ఎంట్రికి అంతా సిద్ధం… సలార్ రిలీజ్ ఎప్పుడంటే?

Salaar Release Date in Japan :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్ జపాన్లో రిలీజ్ కు రెడీగా ఉంది. మరి ఈ మూవీ అక్కడ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అంటే….

జూలైలో జపాన్ లో..

సలార్ సీజ్ ఫైర్ 2023 డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాహుబలి తర్వాత వరుసగా సరైన హిట్ లేక సతమతమవుతున్న ప్రభాస్ కు ఈ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన సలార్ ప్రపంచవ్యాప్తంగా 700 పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సాలిడ్ హిట్ తర్వాత ప్రభాస్ మరింత జోష్ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఓటిటిలో కూడా ఈ మూవీ మిలియన్ల వ్యూస్ స్ట్రీమింగ్ తో డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కాగా ప్రస్తుతం సౌత్ సినిమాల స్పాన్ భారీగా పెరిగింది అన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న పలు సినిమాలు విదేశాల్లో కూడా రిలీజై రికార్డులు బద్దలు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా సలార్ మూవీని జపాన్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. జూలై 5న జపాన్లో సలార్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ విషయం గురించి జపాన్ లో సలార్ ను రిలీజ్ చేయబోతున్న మూవీ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నిజానికి ప్రభాస్ సినిమాలకు జపాన్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ మూవీ కనక అక్కడ రిలీజ్ అయితే జపాన్ లో ప్రభాస్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -

ఇక సలార్ మూవీ విషయానికి వస్తే ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటించగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడు వరదరాజజ్ మన్నార్ పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే జగపతిబాబు, శ్రియ రెడ్డి, ఝాన్సీ, బాబీ సింహ, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించగా, హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఇప్పటిదాకా జపాన్ లో రిలీజ్ అయిన సినిమాలు..

బాహుబలితో ఈ కొత్త ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు. దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీ జపాన్ లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. కేవలం రిలీజ్ మాత్రమే కాదు రీ రిలీజ్ కూడా అయ్యి అక్కడ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలోనే జపాన్ లో సలార్ మూవీ రిలీజ్ కాబోతుండడం విశేషం.ఇక త్వరలోనే మోస్ట్ ఆ వెయిటింగ్ మూవీ పుష్ప 2 కూడా జపాన్ లో రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ 15న పుష్ప 2 మూవీ ఇండియాతో పాటు జపాన్లో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

సలార్ పార్ట్ 2.. సలార్ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో సినిమా రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటికే సలార్ : శౌర్యంగా పర్వం అని టైటిల్ ను కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. పార్ట్ 2 షూటింగ్ మేలో మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు