Krishnamma : అంత గొప్ప సినిమాలు ఇప్పుడు ఏమున్నాయి అనిల్ రావిపూడి గారు.?

Krishnamma : చాలామంది ప్రేక్షకులకు క్రికెట్, సినిమాలు అంటే ఒక కామన్ ఎమోషన్ అని చెప్పొచ్చు. సినిమాల్ని క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వాస్తవంగా మాట్లాడితే సినిమాల కంటే కూడా క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా అనేది ఈరోజు చూడకపోతే రేపు చూసి అవకాశం ఉంటుంది. కానీ జరుగుతున్న మ్యాచ్ ని చూడటంలో ఉన్న ఎంజాయ్మెంట్ వేరు. దీని గురించి ప్రస్తుతం ఉన్న యువతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ లో మ్యాచ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో ఐపీఎల్ మ్యాచ్ ఎంత ఆసక్తికరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 200 దాటి అన్ని టీములు కూడా స్కోర్ చేసి పనిలో పడ్డాయి. ఇకపోతే ఒకదాన్ని మించి ఒకటి నేడు పోటీ పడుతుంది. మ్యాచ్ లు కూడా ఎవరు ఊహించని విధంగా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. అందుకని దాదాపు 20 కోట్ల మంది 30 కోట్ల మంది మ్యాచ్ చూస్తున్నారు.

ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమా అంటే టిల్లు స్క్వేర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాల్తో కొట్టాయి. ప్రేక్షకుల్ని కనీసం థియేటర్ కూడా రప్పించలేకపోతున్నాయి కొన్ని సినిమాలు. అయితే ఈ తరుణంలో అనిల్ రావిపూడి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ చూడకపోతే కొంపలు ఏమి మునిగిపోవు, వచ్చి సినిమా చూడండి. సెకండ్ షో, ఫస్ట్ షో వచ్చి చూడండి అంటూ చెప్పుకొచ్చాడు అనిల్.

- Advertisement -

అనిల్ చెప్పిన మాటలతో సినీ ప్రేమికులందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ అంత గొప్ప సినిమాలు రీసెంట్ టైమ్స్ లో వస్తున్నాయంటే లేదనే చెప్పాలి. టిల్లు స్క్వేర్ తర్వాత ప్రేక్షకులను అలరించిన సినిమా ఇప్పటివరకు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఇకపోతే ఈ వారం ప్రసన్న వదనం అనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాను కూడా మాక్సిమం సినీ ప్రేమికులంతా మార్నింగ్ చూసేస్తారు. ఆ సినిమా మార్నింగ్ చూసేసిన కూడా నెక్స్ట్ మ్యాట్ని ఇంకో సినిమా చూడటానికి కూడా అవకాశం ఉంటుంది.

అయితే ఈ తరుణంలో క్రికెట్ మానుకొని మరి సినిమా థియేటర్ కెళ్ళి చూడాల్సిన అవసరం ఏముందని కొంతమంది అడుగుతున్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి రీసెంట్ గా ఈ మాటలను కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా మంది దర్శకులు అతిథులుగా హాజరయ్యారు. సత్యదేవ్ నటిస్తున్న ఈ సినిమా మే 10న రిలీజ్ కాబోతోంది. అలానే ఈ నెలలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ మూమెంట్స్ పూర్తవుగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సంబంధించిన ప్రోమోషన్స్ ను అగ్రెసివ్ గా చేయనున్నట్లు నిర్మాత నాగ వంశీ కూడా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు