Leo: విజయ్ పాదయాత్ర – సీఎం సీటే లక్ష్యమా – తమిళనాట ప్రకంపనలు..!

తలపతి విజయ్ కి తమిళ నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగే ఫ్యాన్ బేస్ విజయ్ సొంతం. అప్పట్లో రజినీకాంత్ కి ఉన్నంత ఫాలోయింగ్ ఇప్పుడు విజయ్ కి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొంత కాలంగా విజయ్ రాజకీయ రంగప్రవేశం పై వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ పాదయాత్ర ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు తన అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసిన విజయ్ లియో సినిమా రిలీజ్ కి ముందే ఈ పాదయాత్ర స్టార్ట్ చేయాలని నిర్ణయించాడని అంటున్నారు. మరి, విజయ్ కొత్త పార్టీ పెట్టనున్నాడా లేక ఏదైన పార్టీలో చేరుతాడా అన్నదానిపై క్లారిటీ లేదు గానీ, ఈ వార్తలు మాత్రం తమిళనాట పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో నటిస్తున్న విజయ్ వచ్చే ఎన్నికల్లో సీఎం సీటు కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై లియో సినిమా రిలీజ్ కి ముందే అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం.

సేవా కార్యక్రమాల ద్వారా తరచూ ప్రజల్లో ఉండే విజయ్ గతంలో కూడా రాజకీయాలపై తనకున్న ఆసక్తి వ్యక్తపరిచాడు. ప్రస్తుతం తమిళనాట పొలిటికల్ గా కొంత వ్యాక్యూమ్ ఉన్న నేపథ్యంలో విజయ్ కొత్త పార్టీ పెడతాడా లేక ఏదైనా పార్టీలో చేరతాడా అన్నది ఆసక్తిగా మారింది. ఇటీవల విజయ్ చేపట్టిన మెరిట్ విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ వంటి కార్యక్రమాలు పొలిటికల్ ఎంట్రీ కోసమే అని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు