UV creations : శెట్టి పొలిశెట్టి ప్రమోషన్స్ షురూ- భారమంతా పొలిశెట్టి పైనే !

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకి రానుంది. దాంతో ఇప్పటి నుంచే సినిమాపై బజ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.

జాతి రత్నాలు సినిమా తరువాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న నవీన్ పొలిశెట్టి మళ్ళీ ఇన్నాళ్లకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ద్వారా థియేటర్స్ లో సందడి చేయనున్నాడు.

అయితే సినిమాపై టీజర్ రిలీజ్ చేసిన మొదట్లో మంచి అంచనాలే ఉండగా, సినిమా రిలీజ్ లో జాప్యం వల్ల ఉన్న అంచనాలు కాస్త సన్నగిల్లాయి. దానికి తోడు ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పాటలు, ప్రోమోలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దాంతో నవీన్ పొలిశెట్టి మళ్ళీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

- Advertisement -

ఇటీవలనే ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మల్లా రెడ్డి కాలేజీ లో స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అయ్యాడు. మామూలుగానే తన ఎనర్జీ తో స్టేజ్ పైన సందడి చేసే నవీన్ ఇక కాలేజ్ స్టూడెంట్స్ అనగానే మరోసారి తన ఎనర్జీటిక్ పర్పామెన్స్ తో రెచ్చిపోయాడు.

గతంలో తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యలో ఒక డైలాగ్ బాగా ఫేం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ డైలాగ్ ను నవీన్ పొలిశెట్టి స్టేజ్ పైన అచ్చమ్ ఆయనలాగే ఇమిటేట్ చేసి స్టూడెంట్స్ ను ఎంటర్టైన్ చేసాడు. అలాగే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి పాటలకు స్టూడెంట్స్ తో స్టెప్స్ వేయించాడు.

ఇదంతా చూస్తుంటే శెట్టి పొలిశెట్టి సినిమా భారమంతా నవీన్ తనపైన వేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ ఇంకా సమయం ఉంది కాబట్టి ఒకే గాని ముందు ముందు నవీన్ ఒక్కడే సినిమా ప్రమోట్ చేయడం అంటే కష్టమనే చెప్పాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు