Saamajavaragamana: శ్రీ విష్ణు కెరీర్ లో తొలిసారి అక్కడ రికార్డు కొట్టబోతున్నాడు?

టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ గా నటించిన సినిమా “సామజవరగమన” జూన్29న విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు భారీ కలెక్షన్లు సాధిస్తుంది ఈ సినిమా. మొదటి వీకెండ్ స్పై సినిమా ఎఫెక్ట్ వలన పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత మాత్రం భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తుంది.

ఇక “సామజవరగమన” చిత్రం ఇప్పటికే 25కోట్లకి పైగా వసూళ్లు రాబట్టగా, త్వరలోనే ఆ సినిమా త్వరలోనే 30కోట్ల మార్క్ ని దాటబోతుందని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా మరో రేర్ రికార్డు ని అందుకోబోతుంది. అదేంటంటే ఓవర్సీస్ లో ఈ సినిమా 900K డాలర్లని క్రాస్ అయ్యింది. ఇక త్వరలోనే ఈ సినిమా 1మిలియన్ డాలర్ సాధించే దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ద్వారా తొలిసారిగా శ్రీ విష్ణు ఈ ఫీట్ ని సాధిస్తున్నాడని చెప్పాలి. ఒక చిన్న హీరోకి ఓవర్సీస్ లో ఇలాంటి రికార్డు రావడమంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇక తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికి మంచి కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే నుండి 13వ రోజు వరకు రోజుకి కోటికి తగ్గకుండా గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అనిల్ సుంకర కి ఈ చిత్రం మంచి ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఇక సామజవరగమన చిత్రానికి 40కోట్లు వచ్చినట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటికి, ఈ సినిమాకి ఇప్పటివరకు పాతిక కోట్లే వచ్చాయన్నది వాస్తవం. ఇక ఈ సినిమాతో శ్రీ విష్ణు మరో రెండు పెద్ద బ్యానర్ లలో సినిమా ఛాన్స్ అందుకున్నాడని టాక్ నడుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు