Navadeep : లవ్ మౌళి కి ‘ఏ’ సర్టిఫికెట్.. ఆ కంటెంట్ ఎక్కువుందని టాక్?

Navadeep : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో “నవదీప్” ఒకరు. అప్పుడెప్పుడో ‘జై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ మొదట్లో ఏ రెండు మూడు హిట్ సినిమాల్లో నటించగా, ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో ఫేడౌట్ అయ్యాడు. అయితే మధ్యలో పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించడమే కాక, నటుడుగా మంచి పేరు సంపాదించాడు. అలాగే ప్రేక్షకుల్లో బాగా గుర్తుండిపోయాడు. ఇక నవదీప్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా మళ్ళీ సినిమా తో వస్తున్నాడు. న‌వ‌దీప్ 2.0గా క‌నిపించ‌బోతున్న సినిమా ‘లవ్ మౌళి’. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌ ‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌ కు అడ్డాగా మారిన ‘సీ స్పేస్’ నిర్మిస్తోంది. మిస్ ఇండియా కంటెస్టెంట్ పంఖురి గిద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇక రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ వినూత్నంగా ఉండటమే కాకుండా అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కి వెళ్ళింది.

ఏ సర్టిఫికెట్ కొట్టిన లవ్ మౌళి.. ఆ కంటెంట్ ఉందని టాక్?

ఇక కొన్ని రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న నవదీప్ లవ్ మౌళి సినిమా నిజానికి ఏప్రిల్ 19వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడం రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. తాజాగా లవ్ మౌళి సినిమా సెన్సార్ పూర్తయిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. “సెన్సార్ పూర్తయింది. లవ్ మౌళి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 7న రిలీజ్” అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఇక సెన్సార్ బోర్డు అధికారుల నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ అందుకున్నట్లు వెల్లడించారు. ఇక ట్రైలర్ ప్రకారం.. ఈ సినిమా ఓ పెయింటర్ ప్రేమకథగా తెలుస్తోంది. అడ్వెంచర్స్ చేస్తూ ఒంటరిగా జీవించే వ్యక్తిగా నవదీప్ కనిపిస్తారని అర్థమవుతోంది. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో పెయింటింగ్ రూపంలో హీరో చెబుతాడు. అయితే చిత్ర యూనిట్ నుండి వస్తున్న వార్తలు ప్రకారం ఈ సినిమాలో కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని సమాచారం. అందుకే ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని టాక్ నడుస్తుంది.

నవదీప్ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతాడా?

ఇక నవదీప్ (Navadeep) హీరోగా నటించితిన్ లవ్ మౌళి సినిమాకు గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించారు. కృష్ణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ మామిడి వ్యవహరించారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మాతగా ఉన్నారు. ఇక ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న నవదీప్ లవ్ మౌళి సినిమాతో రెండో వెర్షన్ తో 2.0 గా వస్తున్నానని, ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అని అన్నాడు. ఇక నటుడు గా సక్సెస్ అయి, బిజీ అయిన నవదీప్ హీరోగా కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతాడా లేదా చూడాలి. ఇక తాజా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రకారం లవ్ మౌళి సినిమా జూన్ 7న రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు