Ram Charan : చరణ్ ఫ్యాన్స్ కి ఇంత కన్నా బ్యాడ్ టైం ఉండదేమో?

Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస సినిమాలు లైన్లో పెట్టగా ఒక్కో హీరో, వారి వే లో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ కి ఎదగగా, ఇప్పుడు రూపొందుతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే కావడం విశేషం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరోలు చాలా వరకు పాన్ ఇండియా మూవీస్ తో తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తూ ఉండగా, చాలా వరకు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఆడియన్స్ ముందుకు రావడానికి చాలా టైంనే తీసుకుంటూ ఉన్నాయ్. అయితే అందులో అందరు హీరోల ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ తప్ప. దాదాపు రెండేళ్ళ క్రితం RRR సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసి తన మార్కెట్ ను పెంచుకున్న గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. నిజానికి RRR రిలీజ్ కి ముందే ఈ సినిమా ప్రారంభమైంది. 2021 లోనే ప్రారంభమైంది ఈ సినిమా. ఈ సినిమా అనౌన్స్ మెంట్ టైంలో ఫ్యాన్స్ ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తో చాలా సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా నిరాశలో ఉన్నారు.

మరీ ఇంత స్లోగానా?

అయితే మామూలుగా శంకర్ స్లో గానే సినిమాలు తీస్తాడనే పేరుంది. కానీ గేమ్ ఛేంజర్ మూడేళ్ళుగా తెరకెక్కుతుండటం చరణ్ ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు. పైగా శంకర్ చాలా స్లోగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండటం ఒక బాధ అయితే, మధ్యలో ఆగిపోయింది అనుకున్న భారతీయుడు2 అండ్ 3 పార్టుల షూటింగ్ కూడా చేస్తూ ఉండటంతో, గేమ్ చేంజర్ ఎప్పటికప్పుడు మరింత ఆలస్యం అవుతూనే ఉండగా ఈ సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో కుదిరితే సెప్టెంబర్లో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి కానీ. అయితే ఫైనల్ గా జూన్ లో వస్తుంది అనుకున్న భారతీయుడు2 సినిమా జులై సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా, ఆ సినిమా ఫైనల్ పనులు ఇంకా బాలెన్స్ ఉండటంతో ఆ ఇంపాక్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ పై కూడా పడగా, ఆ సినిమా ఇంకా కంప్లీట్ అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉందని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ ఏడాది సినిమా లేనట్టేనా?

అయితే గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని దిల్ రాజు చాలా సార్లు చెప్పగా, ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదని అనిపిస్తుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆ టైంకి సినిమా రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మహా అయితే ఇక సినిమా కుదిరితే దీపావళి లేదా క్రిస్టమస్ టైంకి రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ అది కూడా గ్యారెంటీ లేదు, ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండే క్లారిటీ రావాల్సి ఉంది. దాంతో ఆల్ మోస్ట్ 2 ఏళ్ళు అవుతున్నా రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇంతకన్నా బ్యాడ్ టైం ఉండదని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కాకుంటే మరో సినిమా వస్తుందనడానికి చరణ్ వేరే సినిమా కూడా మొదలు పెట్టలేదు. సెట్స్ పై బుచ్చిబాబు సినిమా ఉన్నా, ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయనే లేదు. మరి గేమ్ ఛేంజర్ ఆడియన్స్ ముందుకు ఏ టైంకి రిలీజ్ అవుతుందో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు