Varsha Bollamma : ప్రతిసారి అంత ఎమోషనల్ అవుతుందేంటీ ఈ పాపా?

Varsha Bollamma : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో వర్ష బొల్లమా ఒకరు. ఈ అమ్మాయి కర్ణాటక కి చెందిన భామ అయినా, ముందు తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. సతురన్ అనే చిన్న సినిమాలో ఎంట్రీ ఇవ్వగా, ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో నటించింది. కానీ అవన్నీ పరాజయం పాలవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కాని విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాలో తన స్టూడెంట్ గా కీలకపాత్రలో నటించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తరవాత కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. తమిళ్ లో అలా సినిమాలు చేస్తూ, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో లాక్ డౌన్ టైం లో ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో వర్ష బొల్లమ తెలుగులో హీరోయిన్ గా హిట్ కొట్టేసింది. అంతకు ముందు చూసి చూడంగానే సినిమాలో నటించగా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక మిడిల్ క్లాస్ మెలోడీస్ తరువాత ఆఫర్లు వస్తున్నా, సెలెక్టడ్ స్క్రిప్ట్ మాత్రమే నెమ్మదిగా చేస్తూ వస్తుంది.

పాపకి బాగా ఫీలింగ్ ఎక్కువ?

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు ట్విట్టర్ లో అప్పుడప్పుడూ ఎమోషనల్ ఇమోజి లు పెడుతూ వస్తుంది. అవి ఎందుకా అని చూస్తే నవ్వాలో, ఏడవాలో అన్నట్టు ఉంది. ఈ అమ్మడు బెంగుళూర్ కి చెందిన అమ్మాయి కాగా, ఐపీఎల్ లో ఆర్సీబీ టీం కి పెద్ద ఫ్యాన్. ఇక తన ఊరు టీమ్ కాబట్టి స్వతహాగానే ప్రాంతీయాభిమానం ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా బెంగుళూర్ వరుసగా మ్యాచ్స్ ఓడిపోతూ వస్తుంది. దాంతో ఈ అమ్మడు హృదయం ముక్కలైపోయినట్టు ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోగానే ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ లు పెడుతూ వస్తుంది. ఇక తాజాగా వరుస ఓటముల తర్వాత ఓ మ్యాచ్ గెలవగా, దానికి కూడా హ్యాపీ టియర్స్ ఎమోజిస్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు, గెలుపోటములను స్పోర్టివ్ గా తీసుకోవాలి. మరీ ఇంతలా ఎమోషనల్ అవడమేంటని ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు.

- Advertisement -

నెక్స్ట్ సినిమా ఎప్పుడూ?

ఇదిలా ఉండగా రీసెంట్ గా “ఊరు పేరు భైరవకోన” సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ (Varsha Bollamma) ఆ సినిమాతో డీసెంట్ హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత సినిమాల విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం పెద్దగా సినిమాలేమి చెయ్యట్లేదు. పలు సినిమాల కథలు వింటూ హోల్డ్ లో పెట్టింది. త్వరలో ఆది సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సినిమాల్లో బిజీగా లేకపోయినా, సోషల్ మీడియా లో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేస్తూ రచ్చ చేస్తుంది. ఇక ఆ మధ్య ఆనంద్ దేవరకొండ తో ఎఫైర్ ఉందని సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ చాలా రోజులకు సినిమా ద్వారా కాకుండా ఇలా ఐపీఎల్ ద్వారా వైరల్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు