Varsha Bollamma : “ఊరు పేరు భైరవకోన” హీరోయిన్ కు విచిత్రమైన ఫోబియా 

ఎన్నో ఇబ్బందులు, పలు వివాదాల అనంతరం ఎట్టకేలకు “ఊరు పేరు భైరవకోన” ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి రోజే ఈ మూవీ ఏకంగా ఏడు కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాను ఇంకా జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం గట్టిగా ట్రై చేస్తోంది. అందులో భాగంగానే “ఊరు పేరు భైరవకోన” సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష తన గురించి ఇప్పటిదాకా ఎవరికి తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తనకొక ఊహించని ఫోబియా ఉంది అని ఆమె చెప్పిన విషయం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. ఇంతకూ వర్షకి ఉన్న ఫోబియా ఏంటి అంటే?

తాజా ఇంటర్వ్యూలో వర్ష మాట్లాడుతూ తనకు దయ్యాలంటే భయం అన్న విషయాన్ని బయట పెట్టింది. అలాగే తనకొక ఫోబియా కూడా ఉందన్న ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చింది. తను టాబ్లెట్ ను మింగలేనని, అదంటే ఇప్పటికీ భయమేనని చెప్పేసింది. అయితే ఇంజక్షన్ అంటే ఈ అమ్మాయికి భయం లేదట. టాటూ కూడా వేయించుకుందట. ఇంత నొప్పిని భరించిన ఈ అమ్మడికి టాబ్లెట్ అంటే చెప్పలేనంత భయమట. ఇక తనకు ఉన్న అతి పెద్ద కోరిక గురించి కూడా వర్ష మాట్లాడింది. వరల్డ్ టూర్ కు వెళ్లి, ప్రపంచం మొత్తాన్ని చుట్టేయాలి అన్నదే ఈ అమ్మడి కోరికట. మరి చివరిసారిగా ఇంస్టాగ్రామ్ లో ఎవరి గురించి సెర్చ్ చేశారు అనే ప్రశ్న ఎదురవ్వగా… ఈమధ్య వైరల్ అయిన ఒక అమ్మాయి ఫోటోను వెతికానని చెప్పింది. ఆ అమ్మాయి మహేష్ బాబు సినిమాలో నటించిందని, ఇప్పుడు హాలీవుడ్ లో ఉండడంతో ఇంతకీ తను ఎవరా అని మామూలుగా చూసానని వెల్లడించింది. వర్ష సెర్చ్ చేసిన ఆ అమ్మాయి మరెవరో కాదు అవంతిక.

వీటితోపాటు చివరిసారిగా అబద్ధం ఎప్పుడు చెప్పారు అనే ఆసక్తికరమైన ప్రశ్నను యాంకర్ సందించగా, బాగా ఆలోచించి వారం క్రితం చెప్పినట్టు ఆన్సర్ ఇచ్చింది వర్ష. అయితే నిజానికి ఇంట్లో వాళ్లతో తరచుగా చిన్నచిన్న అబద్ధాలు ఆడతానని, కానీ ఒక ఫ్రెండ్ విషయంలో పెద్ద అబద్ధం చెప్పి వారం అవుతుందని అన్నది. ఈ సందర్భంగా తనకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారని, వారంతా కాలేజీ నుంచి ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతున్నారని వర్ష పేర్కొంది. అలాగే తనకు ఎమోషనల్ సినిమాలు చూస్తే ఏడుపు వస్తుందని, “కో గయే హమ్ కహా” అనే సినిమా చూసి చివరిసారిగా ఏడ్చాను అని తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ప్రేక్షకులతో పంచుకుంది ఈ బ్యూటీ.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు