Vaishnav Tej : డిజాస్టర్ సినిమాకి స్టార్స్ సినిమాల రేటింగ్స్!

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు థియేటర్స్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయి టెలివిజన్ దగ్గర మాత్రం అంతగా ఆదరణ దక్కించుకోవు. మరి కొన్ని చిత్రాలు మంచి టాక్ తెచ్చుకున్నా, థియేటర్లలో ఎందుకో ఆడలేవు, కానీ టెలివిజన్ దగ్గరికొచ్చే సరికి సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ఒక ఖలేజా లాంటి సినిమాలన్నమాట. కానీ రీసెంట్ గా ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చెత్త టాక్ తెచ్చుకుని, అల్ టైం ఎపిక్ డిజాస్టర్ గా నిలిచిన ఓ సినిమా లక్ వల్లో లేక వేరే ఛానెల్ లో ఏ సినిమా లేకనో బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ గా నిలిచిన సినిమా టెలివిజన్ లో మాత్రం సెన్సేషనల్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది.

రీసెంట్ టైంలో పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా రెండంకెల టి.ఆర్.పి రేటింగ్ లు సొంతం అవ్వడం లేదు. అలాంటిది బాక్స్ ఆఫీస్ దగ్గరే అస్సలు వర్కౌట్ అవ్వని సినిమా చెత్త మూవీ అని అన్ని రకాల ప్రేక్షకుల నుండి టాక్ తెచ్చుకున్న సినిమా టెలివిజన్ లో మాత్రం సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిలిచింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది…ఆ సినిమాయే వైష్ణవ్ తేజ్ శ్రీ లీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా.

ఈ సినిమా తెరకెక్కినపుడు థియేటర్ దగ్గర కనీస హైప్ ని కూడా తెచ్చుకోలేదు. అందుకే బ్రేక్ ఈవెన్ బిజినెస్ కూడా 9 కోట్ల లోపే జరిగినా, దానికి కూడా కనీసం ఓపెనింగ్స్ తెచ్చుకోలేక 2 కోట్ల లోపే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎండ్ అయి అల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమా టెలివిజన్ లో పెద్ద సినిమాల రేంజ్ లో టిఆర్పి రేటింగ్ సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో సైలెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఏకంగా 10.47 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. ఇక ఈ రేటింగ్ తో ఛానెల్ వాళ్ళు మాత్రం సూపర్ ఖుషీలో ఉన్నారని చెప్పొచ్చు. మేకర్స్ మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు తోస్తుంది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు