Thug Life Cast : కమల్ హాసన్ కోసం మీర్జాపూర్ నటులు… జయం రవిని రీ ప్లేస్ చేయ్యడానికేనా…?

Thug Life Cast : కమల్ హాసన్ కెరీర్ గురించి మాట్లాడితే, విక్రమ్‌కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. కమల్ హాసన్ కెరీర్ లో చాలా సినిమాలు వచ్చిన విక్రమ్ ఇచ్చిన హిట్ అంతా ఇంత కాదు. విక్రమ్ ముందు వచ్చిన కొన్ని సినిమాలైతే కమల్ కు డిజాస్టర్ టాక్ తీసుకొచ్చాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, కమల్ హాసన్‌ లోని పూర్తి యాక్టర్ బయటకు రావడానికి ఛాన్స్ వచ్చింది.

విక్రమ్ ముందు వరకు సినిమాలకు గుడ్ బై చెప్పేసి, పూర్తిగా రాజకీయాలకు టైం కేటాయించాలని అనుకున్నారు. కానీ, విక్రమ్ హిట్ తో కమల్ హాసన్ నిర్ణయం మార్చుకున్నాడు. ప్రస్తుతం కమల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో కొన్ని విలన్ పాత్రలు అయితే, థగ్ లైఫ్ మూవీలో హీరోగా చేస్తున్నాడు.

థగ్ లైఫ్‌ను డైరెక్టర్ మణిరత్నం భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. అందులో భాగంగానే, దుల్కర్ సల్మాన్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్ లాంటి నటులను తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి దుల్కర్ సల్మాన్, జయం రవి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత దుల్కర్ సల్మాన్ బ్యాక్ వచ్చిన జయం రవి తప్పుకోవడం కన్ఫామ్ అయిపోయింది.

- Advertisement -

జయం రవి పాత్రను రీప్లేస్ చేయడానికి మణిరత్నం బాలీవుడ్ తలుపులు తట్టాడు. ఈ నేపథ్యంలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో నటించిన అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి ఫైనల్ అయినట్టు సమాచారం. ఇదే నిజం అయితే, థగ్ లైఫ్ మూవీకి బాలీవుడ్‌లో కూడా హైప్ రావడం గ్యారంటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు