Ilayaraja Controversy : నోరు అదుపులో పెట్టుకోండి… వైరాముత్తుకు ఇళయరాజా సోదరుడి స్ట్రాంగ్ వార్నింగ్

Ilayaraja Controversy : నటి యాషికా ఆనంద్‌ కథానాయికగా సెల్వం మాదప్పన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పతికథ పక్కాగల్‌’ సినిమా సంగీత ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన కవి వైరముత్తు వేదికపై సంగీతం గురించి మాట్లాడడం దుమారం రేపుతోంది. ఆయన ఇళయరాజా గురించే ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేశాడు అంటూ టాక్ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన వ్యాఖ్యలకు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

వైరాముత్తు కామెంట్స్..

వేదికపై పాటల రచయిత వైరముత్తు మాట్లాడుతూ “సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే సమస్య తలెత్తింది ఇప్పుడు సినిమా రంగంలో. సంగీతం, సాహిత్యం కలిస్తేనే మంచి పాట రూపొందుతుంది. కానీ కొన్నిసార్లు సంగీతం కంటే భాష గొప్పది. దీన్ని అర్థం చేసుకున్నవాడు తెలివైనవాడు. అర్థం చేసుకోనివాడు అజ్ఞాని అయిన సందర్భాలు ఉన్నాయి” అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వైరముత్తు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాపై పరోక్షంగా విమర్శలు చేశారని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

ఇళయరాజా సోదరుడి వార్నింగ్..

ఈ నేపథ్యంలోనే గంగై అమరన్ వైరముత్తు ప్రసంగాన్ని విమర్శిస్తూ వీడియోను విడుదల చేశారు. గంగై మాట్లాడుతూ “మనల్ని పైకి తీసుకొచ్చిన మనిషికి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ అహంకారం తలకిందులు అయ్యేంతగా పాపులర్ అయింది. వైరముత్తు తనను బతికించిన ఇళయరాజా ఫోటోకి రోజూ పూజ చేయాలి. ఇళయరాజా లేకపోతే వైరముత్తు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇళయరాజా సంగీతంలో మీరు రాసిన పాటలను మరొక స్వరకర్తకు ఇవ్వండి. ఆయన చేసిన మ్యాజిక్ ను ఎవ్వరూ చేయలేరు. సంగీతం లేకుండా పాటలు లేవు. కవులు ఎవ్వరూ తమను తాము పొగుడుకోరు. ఇళయరాజాపై చిన్న నేరం, ఫిర్యాదు వచ్చినా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే వైరముత్తు అహంకారం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

- Advertisement -

అసలు వివాదం ఇదే..

తన 4,500 పాటల రైట్స్ కు సంబంధించిన అగ్రిమెంట్ ముగిసినప్పటికీ పలు సంగీత సంస్థలు ఇంకా వాడుకుంటున్నాయి అని ఆరోపిస్తూ కోలీవుడ్ మ్యూజిక్ దిగ్గజం ఇళయరాజా చెన్నై హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ నడుస్తుండగా బుధవారం మరోసారి వాదనలు జరిగాయి. అయితే తాజాగా ఈ కేసు విషయంలో ఇళయరాజాకు చుక్కెదురయింది. గీత రచయిత, నేపథ్య గాయకుడు కూడా కలిస్తేనే పాట రూపొందుతుంది. సాహిత్యం లేకపోతే పాట లేదు. మరి ఇలా ఆలోచిస్తే పాటలపై పాటల రచయితలకు కూడా రైట్స్ ఉంటాయి. మరి వాళ్ళు కూడా రైట్స్ కోరితే ఏంటి పరిస్థితి? అని ఎదురు ప్రశ్నించారు జడ్జ్.

నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సాంకేతిక నిపుణులకు వాళ్ళ ట్యాలెంట్ ను వాడుకున్నందుకు గానూ నిర్మాతలు డబ్బు చెల్లిస్తారు. అంటే డబ్బు తీసుకున్నాక టెక్నీషియన్స్ క్రియేట్ చేసిన వాటిపై రైట్స్ నిర్మాతలకు మాత్రమే ఉంటాయి. వాళ్ళకు కేవలం రాయల్టీపై మాత్రమే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మద్రాసు ధర్మాసనం జూన్ 2 కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఇళయరాజా విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు