RC16 : మరో జాక్ పాట్ కొట్టేసిన ట్రెండీ విలన్..! ఇక భీభత్సమే..

RC16 : టాలీవుడ్ లో ఈ మధ్య బాలీవుడ్ విలన్ ల హవా బాగా నడుస్తుంది. మొన్న సంజయ్ దత్, నిన్న సైఫ్ అలీఖాన్, నేడు బాబీ డియోల్. ఈ ముగ్గురు రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రతినాయకులు గా పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారు. టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్న ఏ సినిమా చూసిన ఈ ముగ్గురిలో ఒకరు విలన్ గా కనిపిస్తున్నారు. ఇక వీరి కంటే ముందే ఒకప్పుడు జాకీ ష్రాఫ్ లాంటి నటులు కూడా టాలీవుడ్ లో విలన్లుగా చలామణి అయ్యారు. ఇక ఇప్పుడు వీరి ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా వీరి లో బాబీ డియోల్ మరింత జోరు చూపిస్తున్నాడు. అనిమల్ తర్వాత బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకోగా వరుసగా సౌత్ సినిమాల్లో అవకాశాలు ఆ అందుకుంటున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్ లో బాబీ డియోల్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగమవుతున్నాడు. తాజాగా మరో పాన్ ఇండియా హీరో సినిమాలో ప్రతినాయకుడిగా ఆఫర్ అందుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో డియోల్ ఫుల్ బిజీ..

ఇక బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ దాదాపు పదేళ్లుగా తన ఫామ్ కోల్పోయి ఆల్మోస్ట్ ఫేడవుట్ అయిపోగా, లాక్ డౌన్ లో ఆశ్రమ్ అనే సిరీస్ తో క్లిక్ అయ్యాడు. ఇక సందీప్ వంగ తీసిన అనిమల్ తో ట్ర‌బుల్స్ లో ఉన్న బాబి డియోల్ కి గ్రేట్ కంబ్యాక్ దక్కింది. బాలీవుడ్ మొత్తం కూడా డియోల్ బోయ్ ఈజ్ బ్యాక్! అంటూ అంతా స్వాగ‌తించారు. ఇక ఆ ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ లో తన పెర్ఫామెన్స్ త‌ర్వాత అత‌డికి సౌత్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. అన్నిటికంటే ముందుగా తెలుగులో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లో ఆఫర్ రాగా, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలీని పరిస్థితి. ఆ తర్వాత సూర్య కంగువ లో నటిస్తున్నాడు. ఇక ఆ త‌ర్వాత నంద‌మూరి హీరో బాల‌కృష్ణ బాబి కాంబినేషన్ లో వస్తున్న NBK109 లో ఛాన్స్ వచ్చేసింది. ఇక ఇప్పుడు బాబీ కి మరో మెగా జాక్ పాట్ త‌గిలింది. గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్నాడని సమాచారం.

RC16 లో చరణ్ ని డీ కొట్టబోయేది ఇతనే?

ఇక ఇండస్ట్రీ లో వస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ బుచ్చిబాబు సాన ల కాంబోలో తెరకెక్కుతున్న RC16 లో బాబీ డియోల్ అవ‌కాశం ద‌క్కించుకున్నాడ‌ని తెలిసింది. బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క‌థానాయిక జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మధ్యనే మూవీ గ్రాండ్ గా ఓపెనింగ్ కూడా జరుపుకోగా మే లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు బాబి డియోల్ RC16 లో ఎంటర్ అయ్యాడని అప్డేట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో అతడి చేరిక వల్ల పాన్ ఇండియా వైడ్ గా మరింత అంచనాలు పెరిగిపోయాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో డియోల్ విలన్ గా నటిస్తున్నాడా? లేక మరేదైనా పాజిటివ్ రోల్ లో నటిస్తున్నాడా అనేది తెలీదు. అయితే డియోల్ చేసే పాత్రలో మాత్రం డెప్త్ ఆక‌ట్టుకుంటుంద‌ని, బాబికి మంచి పేరు తెస్తుంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు బాబి మెగా కాంపౌండ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా క్లిక్ అయితే బాబీ డియోల్ సౌత్ లో కొన్నాళ్ళు చక్రం తిప్పడం ఖాయమని ట్రేడ్ పండితులు అంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు