RC16 : ఇలా మొదలైందో లేదో అప్పుడే విలన్ చర్చ.. ఆయనేనట?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 గ్రాండ్ గా మొదలయిందన్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రెండో మూవీ నిన్ననే అట్టహాసంగా ప్రారంభమవగా, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖలందరూ గెస్ట్ లుగా హాజరయ్యి ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్లు శంకర్ షణ్ముగం, సుకుమార్ సహా నిర్మాత అల్లు అరవింద్ కూడా హాజరై విషెస్ తెలిపారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ కూడా ఈ ఈవెంట్ కి స్పెషల్ గా హాజరవడం హైలెట్. ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్లు కాకుండా ప్రత్యేక పాత్రలో శివరాజ్ కుమార్ నటిస్తున్నాడని తప్ప ఇతర కీలక పాత్రధారుల గురించి డీటెయిల్స్ ఏమి రాలేదు. అయితే ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లని ఈ సినిమా లో ఒక వ్యక్తి గురించి టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

అప్పుడే విలన్ గురించి చర్చ..

ఇక RC16 లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బుచ్చిబాబుకు అరగంట సమయం ఇస్తే గంటన్నర పాటు ఏమీ ఆలోచించనివ్వకుండా నేరేషన్ కంప్లీట్ చేశారని ఇటీవల ఓ తమిళ్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర గురించి అప్ప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారట. ఆల్రెడీ బుచ్చిబాబు సంజుని సంప్రదించారని, కథ నచ్చి ఆయన కూడా ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో కేజీఎఫ్ 2 తర్వాత సంజయ్ దత్ వరుసగా దక్షిణాది సినిమాల్లో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన లియోలో కూడా తన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇప్పుడు తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ లో, అలాగే రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు చరణ్ బుచ్చిబాబు సినిమాలో కూడా ఆయనే విలన్ అని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

అవసరమా అంటున్న ఫ్యాన్స్..

అయితే సంజు చరణ్ సినిమాలో విలన్ అన్న వార్తలు వస్తున్నప్పటి నుండి ఆయన ఈ సినిమాకు అవసరమా అని ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పైగా చరణ్ తో ఆల్రెడీ హిందీ జంజీర్ లో ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. ఇప్పుడు చరణ్ తో మళ్ళీ అవసరమా అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటు కామన్ ఆడియన్స్ కూడా ఈ విషయం లో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్. ఎందుకంటే వరుస చిత్రాల్లో సంజు విలన్ గా కనిపిస్తే బోర్ కొడుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలలో నిజమెంతో తెలియాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు